డియోడరెంట్‌ వాసనకు ఆగిన బాలిక గుండె.. ఆ రసాయనం అంత డేంజరా..?

-

డియోడరెంట్‌ కూడా ప్రాణం తీస్తుందని మీకు తెలుసా..? ఈ విషయం తెలిస్తే..మీరు ఇక పర్ఫ్యూమ్‌లు, డియోడరెంట్‌లు వాడాలంటే..ఆలోచిస్తారేమో..! ఢిల్లీలో 14 సంవత్సరాల జార్జియా గ్రీన్ అనే బాలిక తన గదిలో డియోడరెంట్ స్ప్రే చేసింది. కొద్ది నిమిషాల తర్వాత ఆమె గుండె ఆగి చనిపోయింది. ఆమె స్ప్రే చేసిన డియోడరెంటే బాలిక మరణానికి కారణమని వైద్యులు నిర్ధారించారు..జార్జియాకు ఆటిజం ఉందని, ఆమెకు సువాసనలంటే ఇష్టమని, అందుకే ఆమె ఉపయోగించే దుప్పట్లపై డియోడరెంట్లను స్ప్రే చేసుకొనే అలవాటు ఉందని బాలిక తండ్రి తెలిపారు. డియోడరెంట్‌ను ఉపయోగించడం ప్రమాదకరమా అనే విషయంపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తుంది.. మీకు ఈ అలవాటు ఉండే ఉంటుందిగా..! మరి ఏ రసయనాలకు ఉన్న డియోడరెంట్‌ వాడకూడదో ఒకసారి చూద్దామా..!

ఈ రసాయనం చాలా డేంజర్‌..

కొన్ని రకాల డియోడరెంట్లలో వాడే రసాయనాలు వాటి నుంచి వచ్చే వాయువులు చాలా ప్రమాదకరంగా మారతాయి… డియోడరెంట్‌లో ఉండే ఏరోసోల్ అనే రసాయనం వల్లే జార్జియా చనిపోయినట్లు తేలింది. ఈ నేపథ్యంలో డియోడరెంట్లు ఎంచుకునే ముందు వాటి గురించి పూర్తిగా తెలుసుకోవడం అవసరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలను ఇలాంటి ప్రొడక్ట్స్‌కు దూరంగా ఉంచాలి..డియోడరెంట్లకు బదులుగా టాల్కమ్ పౌడర్‌ను ఉపయోగించవచ్చు.
డియోడరెంట్లలో ఏరోసోల్ అనే విషపూరితమైన రసాయనం ఉంటుంది. ఈ వాయువులు ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు. పిల్లలకు మాత్రమే కాదు ఈ విషయాల గురించిన అవగాహన పెద్దవారిలో కూడా ఉండాలి..ఏరోసోల్ వాసనను మోతాదుకు మించి పీల్చడం వల్ల ఆమె శరీరంలోకి విషవాయువు ప్రవేశించి ఉండవచ్చని, ఆ వెంటనే ఆమె కార్డియాక్ అరెస్టుకు గురై ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

కార్డియక్ అరెస్ట్ అంటే..

గుండెలో ఏర్పడే ఎలక్ట్రానిక్ సమస్య వల్ల కార్డియక్ అరెస్ట్ అవుతుంది. అయితే, కార్డియక్ అరెస్ట్‌ను ముందుగా గుర్తించలేం. గుండెలో ఏర్పడే ఎలక్ట్రికల్ అలజడి వల్ల గుండె లయ తప్పుతుంది. దీంతో రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడుతుంది. ఫలితంగా గుండెతోపాటు శరీరంలోని ఇతర భాగాలకు రక్త ప్రసరణ నిలిచిపోతుంది. దీనివల్ల క్షణాల్లోనే కుప్పకూలిపోతారు…ఆ సమయంలో వెంటనే సీపీఆర్ ఇవ్వడం ద్వారా మళ్లీ ప్రాణం పోయవచ్చు. అయితే, పైన జరిగిన ఘటనలో అది సాధ్యం కాలేదు. వెంటనే బాలికకు సీపీఆర్ చేసి ఉంటే బతికే అవకాశాలుండేవి.

లక్షణాలు ఇవే:

ఛాతిలో నొప్పి
విచిత్రంగా వినిపించే గురక
శ్వాస ఆడకపోవడం
స్పృహ కోల్పోవడం
తల తిరగడం
గుండె లయ తప్పడం
గుండె దడగా ఉండడం
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే స్పందించి డాక్టర్ను సంప్రదించడం లేదా ప్రథమ చికిత్స చేయాలి.. అలాగే మీరు వాడే డియోడరెంట్‌లో పైన చెప్పిన రసాయనం ఉంటే వాటిని పక్కన పడేయండి..

Read more RELATED
Recommended to you

Latest news