బొప్పాయి ఆకులతో తెల్లజుట్టును శాశ్వతంగా నల్లగా మార్చేయొచ్చు..!!

-

ఒకప్పుడు తెల్లజుట్టు అంటే వయసు పెరిగిన వాళ్లకే వస్తుంది అనుకునేవాళ్లం.. కానీ ఈరోజుల్లో స్కూల్‌కు వెళ్లే పిల్లలకే జుట్టు నెరిసిపోయి.. తెల్లగా మారిపోతుంది. ఇక కాలేజ్‌కు వచ్చేసరికి..సగం తల తెల్లగా ఉంటోంది.. చాలామంది.. వైట్‌ హెయిర్‌ కనిపించకుండా కలర్స్‌ వాడుతుంటారు.. కానీ రసయనాలతో కూడిన కలర్స్‌ వల్ల జుట్టు ఇంకా దెబ్బతిని..తెల్లజుట్టు ఇంకా పెరిగిపోతుంది. మీరు గమనించారో లేదో.. కొంచెం తెల్లజుట్టు ఉన్నవాళ్లు కలర్‌ వేసుకుంటే.. అది కాస్తా కొన్ని రోజులకు తలలో అక్కడక్కడా వైట్‌గా అయిపోతుంది.. తెల్లజుట్టు నల్లగా అయ్యేందుకు ఎన్నో నాచురల్‌ రెమిడీస్‌ ఉన్నాయి. అందులో ఒకటి..బొప్పాయి ఆకు.. ఈ ఆకును చాలామంది.. తెల్లరక్తకణాలు తగ్గినప్పుడు జ్యూస్‌గా చేసుకుని తాగుతారు. డెంగ్యూ ఫీవర్‌కు బెస్ట్‌ మెడిసిన్‌గా చెప్పుకోవచ్చు.. ఈరోజు ఈ ఆకుతో తెల్ల జుట్టుకు ఎలా చెక్‌ పెట్టాలో చూద్దామా..!
రెండు బొప్పాయి ఆకుల‌ను, 5 బిర్యానీ ఆకుల‌ను, 5 ల‌వంగాల‌ను, ఒక టీ స్పూన్ కాఫీ పౌడ‌ర్‌ను, త‌గినంత హెన్నా పౌడ‌ర్‌ను తీసుకోండి..ముందుగా బొప్పాయి ఆకుల‌ను శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత వాటిని ముక్క‌లుగా చేసి ఒక జార్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో అర గ్లాస్ నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోండి.. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని వ‌డ‌క‌ట్టుకుని గిన్నెలోకి వేయండి.. మ‌రో గిన్నెలోకి ఒక గ్లాస్ నీళ్లు, బిర్యానీ ఆకులు, ల‌వంగాలు, కాఫీ పౌడ‌ర్ వేసి మ‌రిగించాలి. వీటిని అర గ్లాస్ అయ్యే వ‌ర‌కు మ‌రిగించి వ‌డ‌క‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇనుప క‌ళాయి లేదా గిన్నెను తీసుకుని అందులో జుట్టుకు త‌గినంత హెన్నా పౌడ‌ర్‌ను వేయండి.. ఇందులోనే బొప్పాయి ఆకుల ర‌సం, బిర్యానీ ఆకుల డికాష‌న్‌ను వేస్తూ పేస్ట్‌లా క‌లుపుకోవాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి 5 గంట‌ల పాటు అలాగే ఉంచాలి. 5 గంట‌ల త‌రువాత ఈ పేస్ట్‌ను మ‌రోసారి క‌లుపుకుని జుట్టు కుదుళ్ల నుండి జుట్టు చివ‌రి వ‌ర‌కు ప‌ట్టించాలి.
దీనిని ఒక గంట పాటు జుట్టుకు అలాగే ఉంచి ఆరిన త‌రువాత త‌ల‌స్నానం చేస్తే సరి…అయితే ముందుగా షాంపు వాడ‌కుండా త‌ల‌స్నానం చేయాలి. మ‌రుస‌టి రోజు షాంపుతో త‌ల‌స్నానం చేయాలి. ఈ విధంగా ఈ చిట్కాను నెల‌కు రెండు సార్లు వాడ‌డం వ‌ల్ల తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారుతుంది. అలాగే జుట్టు న‌ల్ల‌గా, ఒత్తుగా, ధృడంగా పెరుగుతుంది. జుట్టు రాల‌డం, చుండ్రు, జుట్టు చివ‌ర్లు చిట్ల‌డం వంటి స‌మ‌స్య‌లు కూడా ఉండవు..
చిన్నవయసులోనే తెల్లజుట్టు రావడానికి కారణం.. పోషకాహార లోపం.. ఎక్కువగా బయటఫుడ్స్‌ తిని.. ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు.. వీలైనంత వరకూ పిల్లలకు బయటి ఆహారాలు అలవాటు చేయకపోవడమే మంచిది.. ఇంట్లోనే రకరకాల స్నాక్స్‌ చేసిపెట్టండి.. డైలీ ఏదో ఒక పండు ఇవ్వండి. ఆకుకూరలు అలవాటు చేయండి..!

Read more RELATED
Recommended to you

Latest news