నేటి సమాజంలో వాట్సప్ గురించి తెలియని వారంటూ ఎవరు లేరు. చిన్న పిల్లల నుండి ముసలి వాళ్లదాకా అందరు వాట్సప్ ని వాడుతూనే ఉన్నారు. ఇక ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 2బిలియన్లకు పైగా ప్రజలు ఉపయోగించే వాట్సప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ ని తీసుకొస్తుంది. తాజాగా మరో కొత్త ఫీచర్ ని తీసుకొచ్చేందుకు సిద్దమవుతుంది.
ఈ కొత్త ఫీచర్ ద్వారా మనం ఇతరులతో చాట్ చేసేటప్పుడు ప్రతి ఛాట్ పేజ్‌కి కొత్త వాల్‌పేపర్‌ను ఎంచుకోవచ్చు. దీనికోసం కొత్తగా వాల్‌పేపర్ గ్యాలరీ అప్‌డేట్ చేశారు. అలాగే వినియోగదారులు స్టిక్కర్లను టెక్స్ట్ లేదా ఎమోజీలతో సహాయంతో శోధించడానికి ఒక ఫీచర్ ని కూడా తీసుకొస్తున్నట్లు తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క “టుగెదర్ ఎట్ హోమ్” స్టిక్కర్ ప్యాక్ ఇప్పుడు యానిమేటెడ్ స్టిక్కర్లుగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. కస్టమ్ వాల్ పేపర్ ఫీచర్ లో భాగంగా కొత్తగా 32 బ్రైట్ వాల్‌పేపర్స్, 30 డార్క్ వాల్‌పేపర్స్ ఇస్తున్నట్లు వాట్సాప్ తన బ్లాగ్ లో తెలిపింది. మీ ఫోన్ లో లైట్ మరియు డార్క్ మోడ్ సెట్టింగుల కోసం ప్రత్యేక వాల్‌పేపర్‌లను కూడా ఎంచుకోవచ్చు.
ఇక మీ ఫోన్ లో డార్క్ మోడ్ మారినప్పుడు మీ చాట్ యొక్క వాల్ పేపర్ దానంతట అదే మారనుంది అని వెల్లడించారు. అంతేకాదు వాట్సాప్ డిఫాల్ట్ డూడుల్ వాల్‌పేపర్‌ను మరిన్ని రంగుల్లో అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపింది. మీకు నచ్చిన వాల్ పేపర్ ఎంచుకొని దానికి తగినట్లుగా బ్రైట్ నెస్, ఓపెసిటీలో మార్పులు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. ఒక వేళ మీకు ఇది నచ్చకపొతే పాత వాల్ పేపర్ ఎంచుకొనే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఫీచర్ కొందరికి మాత్రమే అందుబాటులో ఉంది అని పేస్ బుక్ తెలిపింది. త్వరలో దీనిని అందరికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.