అమ్మవారి పాదాల కింద లేఖ..అందులో ఏం రాసిందంటే..?

-

నేడు విజయదశమి కావడంతో దేశ వ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి.భక్తులు ఘనంగా అమ్మవారికి పూజలు నిర్వహిస్తూ అనేక రూపాల్లో ప్రత్యక్షమైన అమ్మవార్లను పూజిస్తున్నారు. కాని తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో మాత్రం అమ్మవారి ఆలయంలో ఓ భక్తుడు పెట్టిన లేఖ కలకలం రేపుతోంది. భవానీ మాతను కష్టాలు తీర్చమని కోరుకుంటూనే తన వ్యక్తిగత సమస్యను లేఖలో పొందుపర్చి అమ్మవారి విగ్రహం దగ్గర ఉంచిన వార్త కలకలం రేపుతోంది. జిల్లాలోనే కాదు సోషల్ మీడియాలో కూడా అజ్ఞాత భక్తుడు అమ్మవారికి రాసిన లేఖపైనే చర్చ జరుగుతోంది. ఆ లేఖలో ఎన్నో విషయాలు ఉన్నాయి.

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్న మార్కెండేయ ఆలయంలోని దుర్గమాత విగ్రహం పాదాల దగ్గర ఓ అజ్ఞాత భక్తుడు వదిలివెళ్లిన లేఖ ఇప్పుడు అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. లేఖే కదా అని కొట్టిపారేయవద్దు. ఎందుకంటే ఆ లేఖ సారాంశం అంతా డబ్బు చుట్టూ తిరగడంతో పాటు లేఖలో ఉన్న పేరు కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి బంధువు అనే ప్రచారం జరుగుతోంది. అయితే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అనే విషయంపైనే మాత్రం క్లారిటీ రావడం లేదు. అమ్మవారి విగ్రహం పాదాల దగ్గర వదిలిన వెళ్లిన లేఖలో ఏమని రాసి ఉందంటే..అమ్మా భవాని మేము మీ భక్తులం కష్టాలలో ఉన్నాం అదుకోవాలి అమ్మా కాలేజీ కోసం నరైన్‌ గాంధీ అనే వ్యక్తి తన దగ్గర డబ్బులు తీసుకున్నాడని లేఖ రాసిన భక్తుడు పేర్కొన్నాడు…

డబ్బులు తీసుకున్న నరైన్‌ గాంధీ అనే వ్యక్తి తిరిగి ఇస్తే అందులో జగిత్యాలలో జరుగుతున్న గుడి నిర్మాణానికి తన వంతు సాయం చేస్తానని లేఖ ద్వారా భక్తుడు అమ్మవారికి మాట ఇచ్చాడు. ఇప్పుడు ఈ లేఖే జగిత్యాల జిల్లాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది..డబ్బుల విషయం పోలీసులకు చెప్పకుండా ఇలా అమ్మవారికి వదిలివెయ్యడం విశేషం..పేరుతో సహా లేఖలో రాయడంతో విషయం పోలీసుల వరకు వెళ్లింది…లేఖ రాసిన వ్యక్తితో అసలు ఆ గాంధీ ఎవరూ అనే సంగతి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..వాళ్ళ గురించి తెలుసుకోనే ప్రయత్నం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news