ఆ దేశాల్లో పిల్లలను పెంచే పద్ధతే వేరు.. 9 నెలలకే డైపర్లు బంద్‌..!

-

పిల్లలను పెంచడంలో ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని పాటిస్తుంటారు. కొందరు చీటికిమాటికి చేయిచేసుకుంటారు.. మరికొందరు పనిష్‌మెంట్స్‌ ఇస్తారు.. ఇంకొంతమంది పేరంట్స్‌ అయితే వాళ్లే పనిష్‌ చేసుకుంటారు.. చిన్నవయసులో పిల్లలకు తల్లిదండ్రులు అంటే ప్రేమ ఎక్కువగా ఉంటుంది..దాంతో పిల్లలు చేసిన తప్పులకు మీరు పనిష్‌ చేసుకుంటే.. ఆటోమెటిగ్‌గా మళ్లీ వారు ఆ తప్పు చేయలేరు. ఇక తిండి విషయంలో అయితే అందరూ ఒకేలా ఉంటారు.. ఎప్పుడూ ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు.. ఎదిగే పిల్లలకు బలం కావాలని తినిపిస్తారు..డైపర్లు కూడా అంతే.. 24/7 వేస్తారు.. కానీ కొన్ని దేశాల్లో పిల్లలను పెంచే పద్ధతి చాలా గమ్మత్తుగా ఉంటుంది. కొన్నింటి గురించి మనమూ తెలుసుకుందామా!
వియత్నాంలో తల్లిదండ్రులు పిల్లలకు తొమ్మిది నెలలు వచ్చే సరికి డైపర్లు వేయడం మానేస్తారట.. వారికి కాలకృత్యాల అవసరమొస్తే చాలు చిన్నగా ఈల వేయడం నేర్పిస్తారట. దాంతో..తల్లిదండ్రులు అలర్ట్‌ అవుతారు.. ప్రతిసారి డైపర్లు వేయడం వల్ల అది పిల్లలకు చిరాకు, చర్మం పాడవుతుంది..పెద్ద తలనొప్పి.. ఈ టెక్నిక్‌ ఏదో బాగుందే..!
మనం సాధారణంగా పిల్లలకు ఆకలేస్తుందేమోనని ఆలోచిస్తూ తరచూ ఏదో ఒకటి పెడుతూనే ఉంటాం. కానీ, ఫ్రాన్స్‌, దక్షిణ కొరియాలో ఎంత చిన్నపిల్లలైనా సరే వారు అలా చేయరు. పెద్దవాళ్లు ఎప్పుడు తింటే అప్పుడే వాళ్లతో కలిసి భోజనం చేస్తారు పిల్లలు.. అది వాళ్లలో క్రమశిక్షణ పెంచుతుందని వారి నమ్మకం. అంతేకాదు, చిన్నారులు తినడంలో ఎంచుకోవడం కంటే అన్నీ తినగలిగేలా అలవాటు చేసుకుంటారని వారు భావిస్తారు.
అమెరికాలో పిల్లలను పక్కన పడుకోపెట్టుకోరు.. ఇలా చేయడం వల్ల పిల్లలు ప్రతి దానికీ ఇతరులపై ఆధారపడతారని వారు నమ్ముతారు. అలానే జపాన్‌లో చిన్నారులు స్వతంత్రంగా ప్రజా రవాణా వ్యవస్థల్ని ఉపయోగిస్తారు. దాన్ని పెద్దలు చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తారట.
నార్వే, స్వీడన్‌, ఫిన్‌లాండ్‌ దేశాల్లో గడ్డకట్టే చలిలోనూ పసిపిల్లలను సైతం కాసేపు బయట అలా తిప్పుతారట. ఇలా చేస్తే వారు స్వచ్ఛమైన గాలి పీల్చుకోగలుగుతారనీ, జలుబు బారిన పడకుండా ఉంటారని అక్కడి వారి నమ్మకం.
స్వీడన్‌లో పెద్దవారితో పాటూ కుటుంబానికి సంబంధించిన అన్ని నిర్ణయాల్లో పిల్లల అభిప్రాయం తీసుకుంటారట… దీనివల్ల సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం చిన్నప్పటి నుంచే అలవాటవుతుందని. బాగున్నాయి కదా. వీరి పద్ధతులు.. ఇంతకీ మీరు పిల్లలను పెంచడంలో ఏదైనా స్పెషల్‌ టిప్‌ ఫాలో అవుతుంటే కమెంట్‌ చేయండి..!

Read more RELATED
Recommended to you

Latest news