ఆడవాళ్ళని బాగా ఆకర్షించే మగవాళ్ళలోని లక్షణాలు..

Join Our Community
follow manalokam on social media

ఆడా, మగా ఇద్దరి మధ్య ఆకర్షణ అనేది ఇద్దరికీ డిఫరెంట్ గా ఉంటుంది. ఆడవాళ్ళలో మగవాళ్ళకి ఆకర్షణ కలిగించే అంశాలు అందరికీ దాదాపుగా ఒకేలా ఉంటాయి. కానీ మగవాళ్ళలోని ఆడవాళ్ళని ఆకర్షించే గుణాలు ఒక్కొక్కరికీ ఒక్కో రకంగా ఉంటాయి. ఐతే కొన్ని మాత్రం కామన్ గా కనిపిస్తాయి. అలాంటి కామన్ గా అనిపించే ఆడవాళ్ళని ఆకర్షించే మగవాళ్ళలోని లక్షణాలేంటో చూద్దాం.

భయం

భయపడకుండా తమకి అనిపించింది ధైర్యంగా చెప్పే మగవాళ్ళని ఆడవాళ్ళు ఇష్టపడతారు. ఆపదల్లోంచి తమని కూడా అలానే రక్షిస్తారనే నమ్మకం వాళ్ళలో కలుగుతుంది కాబట్టి, ధైర్యంగా ఉండే మగవాళ్ళకి ఆకర్షితులవుతారు. ఈ లక్షణం ఆడవాళ్ళని బాగా ఆకర్షిస్తుంది.

పౌరుషం

పౌరుషం అనగానే ఫ్యాక్షన్ డ్రామా ఊహించేసుకోకండి. ఆడవాళ్ళలా ప్రతీ దానికి భయపడిపోతూ, ఆడపిల్లల్లా ప్రవర్తించే వారిని ఇష్టపడరు. ఆడవాళ్ళని ఆకర్షించాలంటే మీలో పౌరుషం ఉండాలి. అలా అని చెప్పి మీకు కనిపించిన వారినల్లా కొట్టేసి ఇదే నా పౌరుషం అని చూపించకండి. అవతలి వాళ్ళు కూడా మీలాగే ఆలోచిస్తే ఎలా ఉంటుందో తెలుసుకోండి.

స్టైల్

ట్రెండ్ కి తగినట్టుగా ఉండేవారిని ఎక్కువ ఇష్టపడతారు. అందుకే వేసుకునే బట్టలు కూడా లెక్కలోకి వస్తాయి. ఆడవాళ్ళని ఆకర్షించడానికి ఇది బాగా పనిచేస్తుందని చాలా మందికి తెలుసు.

ముక్కుసూటితనం

మీరేం మాట్లాడాలనుకుంటున్నారో చెప్పకుండా దాచి పెట్టడాన్ని వాళ్ళు సహించరు. ధైర్యంగా, ముక్కుసూటిగా మాట్లాడితే బాగుంటుందని అనుకుంటారు. మనసులోని ఉన్నది ఉన్నట్టు చెబితేనే ఆడవాళ్ళని ఆకర్షించగలరు.

లక్ష్యం

లక్ష్యం కలిగి ఉన్న అబ్బాయిలనే అమ్మాయిలు ఇష్టపడతారు. మీరెంత ధనవంతులైనా మీకంటూ ఏదైనా లక్ష్యం ఉంటేనే మిమ్మల్ని ఇష్టపడతారు.

TOP STORIES

నడుం నొప్పి తగ్గాలంటే ఈ ప్రాసెస్ పాటించండి..!

ఈ రోజుల్లో యుక్త వయసు వారి నుంచి వయో వృద్ధుల వరకు అందరికీ ఉన్న ప్రధాన సమస్య నడుం నొప్పి. సాధారణంగా నడుం నొప్పి రెండు...