జనరల్ నాలెడ్జ్ పెంచుకునే విషయాలు.. ఇవి మీకు తెలుసా..!

-

అనుభవాలు పాఠాలు నేర్పితే.. కొత్త విషయాలు జ్ఞానాన్ని పెంచుతాయి. మనకు తెలియని చరిత్ర చాలా ఉంది. పుట్టకముందు జరిగిన ఘటనలు ఎన్నో.. భూమిపై నేటికి ఎంతోమంది వీటిని గుర్తించలేదు. మీకు తెలుసా.. వంటనూనెలను విమానాలకు ఇంధనంగా వాడొచ్చని, నాలుగు శతాబ్ధాల నుంచి.. తెరవని వైన్ బాటిల్ ఒకటి ఉందట. ఇంకా ఇలాంటి విషయాలు మీకోసం..
భూమిపై మనుషులకు మాత్రమే గెడ్డాలు ఉంటాయట. అవును నిజమే కదా..!
పెంగ్విన్లు ఒకప్పుడు నార్వేలో విపరీతంగా ఉండేవి.
ప్రపంచంలోని అరటిపండ్లలో 500 రకాలకు పైగా ఉన్నాయి. కానీ మనం తినేవి గట్టిగా.. నాలుగు ఐదు రకాలు ఉంటాయామో కదా..!
జెల్లీ బీన్స్, క్యాండీలకు కోటింగ్ మెరుపు ఇచ్చే షెల్లాక్ (Shellac)ని పురుగుల వ్యర్థాలతో తయారుచేస్తారట. మీకు ఇవి తినే అలవాటుందా..?
ఇండియాలో జులై 25, 2001లో ఎరుపు వర్షం పడింది. వాన పడే ముందు… గాలిలో ఎరుపు రంగు దుమ్ము కలవడం వల్ల ఇలా జరిగిందని చెప్తుంటారు.
ప్రపంచంలో తెరవకుండా ఉన్న పురాతన వైన్ బాటిల్ ఒకటుంది. అది 4వ శతాబ్దం కాలం నాటిది.. అదే రోమర్‌వీన్ (Romerwein) లేదా స్పెయెర్ వైన్ (Speyer wine) బాటిల్.
వెదురు చెట్టు రోజూ 2.9 అడుగులు (35 అంగుళాలు) పెరుగుతుంది. భూమిపై వేగంగా పెరిగే చెట్టు ఇదే.
పెంపుడు కుక్కలు వాటి కళ్ల ద్వారా హావభావాలు పలికించగలవు. తమ ఉద్దేశాన్ని అలా చెప్పగలవు. కళ్ల చుట్టూ ఉండే కండరాలు వల్ల ఇలా చేస్తాయి. మీరు కూడా ఓ సారి.. మీ కుక్క కళ్లను గమినిస్తే.. అవి ఏ మూడ్ లో ఉన్నాయో తెలుసుకోవచ్చు.
చందమామ భూమి నుంచి ఏటా… 1.48 అంగుళాల దూరం జరుగుతోంది.
కొన్ని రకాల నత్తలకు వేల కొద్దీ దంతాలు ఉంటాయి. అవి ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేస్తాయి.
సౌర కుటుంబంలో సూర్యుడు 99.9 శాతం ద్రవ్యరాశి (mass)తో ఉన్నాడు. మిగతా గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలూ, తోకచుక్కలు, దుమ్ము, వాయువులు అన్నీ కలిపి 0.1 శాతం ద్రవ్యరాశితో ఉన్నాయట.
ప్లూటో ఉపగ్రహమైన చరాన్ (Charon)పై విచిత్రమైన డార్క్ ప్లేస్ ఒకటుంది. దాన్ని మోర్డోర్ (Mordor) అంటారు. అక్కడ ఎండిపోయిన రక్తం ఉన్నట్లు కనిపిస్తుందట.
వంట నూనెను విమానాలకు ఇంధనంగా వాడొచ్చు. సగం సంప్రదాయ ఇంధనం, సగం వంట నూనెను కలిపి ఉపయోగించవచ్చట.
ఎలుగుబంట్ల లాగా మనుషులు కూడా నిద్రాణస్థితి (hibernating)లో ఉండగలరని నిపుణుల అంచనా. ఇది సాధ్యమైతే.. దూరంగా ఉన్న ఇతర గ్రహాలకు వెళ్లేందుకు వీలవుతుంది.
సముద్ర అలల లాంటి మేఘాలు కూడా ఉన్నాయి. వీటిని కెల్విన్ హెల్మ్‌హోల్ట్జ్ మేఘాలు (Kelvin-Helmholtz clouds) అంటారు. 2019 జూన్‌లో ఈ మేఘాలను వర్జీనియాలోని రోనోక్ (Roanoke) ప్రాంత ప్రజలు చూశారు.

Read more RELATED
Recommended to you

Latest news