లండన్‌లోని సోహో ప్రాంతంలో 1847 నుంచి ద కోచ్ అండ్ హార్సెస్ అనే పబ్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడీ పబ్ న్యూడిస్ట్ పబ్‌గా మారింది.
పుర్రెకో బుద్ధి.. జిహ్వకో చాపల్యం.. అన్నారు పెద్దలు.. అంతే మరి.. ఒక్కో మనిషి ఆలోచన ఒక్కో రకంగా ఉంటుంది. అలాగే వారు ఇష్టపడే రుచులు కూడా వేర్వేరుగా ఉంటాయి. ఏ ఇద్దరూ ఒకే ఆహారాన్ని ఇష్టపడాలని రూల్ కూడా ఏమీ లేదు కదా. అయితే ప్రపంచంలోని చాలా మందికి కొన్ని రకాల ప్రత్యేకమైన ఆసక్తులు ఒకే రకంగా ఉంటాయి. వాటిల్లో ఒకటి.. నగ్నంగా తిరగడం. అలాంటి గ్రూప్‌కు చెందిన వారిని న్యూడిస్టులు అని పిలుస్తారు. అయితే ఇప్పుడు ఇలాంటి వారి కోసమే లండన్‌లో ఓ పబ్ ఆఫర్ అందిస్తోంది. అదేమిటంటే…
లండన్‌లోని సోహో ప్రాంతంలో 1847 నుంచి ద కోచ్ అండ్ హార్సెస్ అనే పబ్ కొనసాగుతోంది. గతంలో దీన్ని చాలా మంది కొనుగోలు చేయాలని చూశారు. కానీ దీన్ని ఎవరూ చేజిక్కించుకోలేకపోయారు. ఇక లండన్‌లో ఏర్పాటు చేసిన తొలి శాఖాహార పబ్‌గా కూడా ఈ పబ్‌కు ఎంతగానో పేరుంది. ఈ క్రమంలోనే ఇప్పుడీ పబ్ న్యూడిస్ట్ పబ్‌గా మారింది. అందులో ఇకపై కస్టమర్లే కాదు, అక్కడ పనిచేసే సిబ్బంది కూడా నగ్నంగా తిరగవచ్చు. కస్టమర్లు నగ్నంగా మందు కొడుతూ ఎంజాయ్ చేయవచ్చు.
కాగా ఈ పబ్‌లో కస్టమర్లు, సిబ్బంది నగ్నంగా తిరిగేందుకు అక్కడి ప్రభుత్వం ఇటీవలే అనుమతినిచ్చింది. దీంతో ఇకపై ఈ పబ్ న్యూడిస్ట్ పబ్‌గా మారనుంది. అయితే న్యూడిస్ట్ పబ్ అని చెప్పి అందులో ఎప్పుడు పడితే అప్పుడు బట్టలు లేకుండా తిరుగుదాం.. అంటే కుదరదు. అందుకు ఓ సమయం ఉంటుంది. ఆ పబ్ వారు ఫలానా తేదీ, ఫలానా సమయంలో పబ్‌లో నగ్నంగా తిరగవచ్చు.. అని ముందుగా తెలియపరుస్తారు. దీంతో ఆ వివరాలను తెలుసుకుని.. ఆ తేదీ, సమయం చూసుకుని మరీ పబ్‌లోకి వెళ్లి నగ్నంగా ఎంజాయ్ చేయాల్సి ఉంటుంది. ఏది ఏమైనా.. ఈ న్యూడిస్ట్ పబ్ మాత్రం ఇప్పుడు లండన్‌లో న్యూడిస్ట్‌లను విపరీతంగా ఆకర్షిస్తోంది.. చూద్దాం మరి.. ఇంకా ఇలాంటి పబ్‌లు ఎన్నివస్తాయో.. ఎక్కడ వస్తాయో..!