సంచ‌ల‌న రికార్డు క్రియేట్ చేసిన టిక్‌టాక్..

-

ప్ర‌పంచ వ్యాప్తంగా టిక్‌టాక్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. నిజం చెప్పాలంటే టిక్‌టాక్ ఈ వ‌ర్గ ఆ వ‌ర్గం అని తేడా లేకుండా అన్ని దేశాల్లో విప‌రీతంగా క్రేజ్ సంపాదించుకుంది. దీనికి చిన్న పెద్దా అంతా కూడా అడిక్ట్ అయిపోర‌నే చెప్పాలి. ఇక ఇప్పుడు టిక్‌టాక్ చాలా దేశాల్లో బ్యాన్ అయినా కూడా దాని హ‌వా మాత్రం ఏ మాత్రం కూడా త‌గ్గ‌ట్లేదు.

టిక్ టాక్ మన దేశంలో కూడా ఓ పూపు ఊపింది. ఇక మ‌న దేశంతో పాటే చాలా దేశాల్లో టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది. దీని దాని ఎఫెక్ట్ త‌గ్గుతుంని చాలామంది భావించినా కూడా ఏ మాత్రం త‌గ్గ‌కుండా దూసుకుపోతూనే ఉంది. ఇప్పుడు ఇదే క్ర‌మంలో మ‌రో సంచ‌ల‌న రికార్డు నెల‌కొల్పింది టిక్ టాక్ యాప్‌. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇప్ప‌టి దాకా ప్రపంచవ్యాప్తంగా అత్య‌ధిక యూజ‌ర్లు డౌన్‌లోడ్ చేసుకున్న స్మార్ట్ యాప్‌గా టిక్‌టాక్ రికార్డుల‌కు ఎక్కింది. నిజం చెప్పాలంటే ఇది ప్ర‌పంచ రికార్డు అనే స‌మాచారం. ఇప్ప‌టికే ఈ విధ‌మైన రికార్డులో ఫేస్‌బుక్ ముందున్నా కూడా దాన్ని సైతం వెన‌క్కు నెట్టేసి టాప్ ప్లేస్‌లో టిక్ టాక్ నిల‌బ‌డింది. చాలా దేశాల్లో టిక్ టాక్ ఈ విధంగా బ్యాన్‌కు గురైనా కూడా ఈ స్థాయి రికార్డు న‌మోదు చేసిందంటే దాని ప్ర‌భావం ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news