బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ల రేసు లో లేను.. క్లారిటీ ఇచ్చిన ఉప్పల్ బాలు..!

-

మరోవైపు బిగ్ బాస్ 3 హోస్ట్ గా నాగార్జునను ఎంపిక చేశారు. మొదటి సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్, రెండో సీజన్ కు నాని వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

ఉప్పల్ బాలు గురించి తెలియాలంటే మీకు ముందు టిక్ టాక్ గురించి తెలిసి ఉండాలి. అవును.. ఉప్పల్ బాలు టిక్ టాక్ స్టార్. టిక్ టాక్ ఉపయోగించే ప్రతి ఒక్కరికి ఆయన సుపరిచితుడే. ఆయన వీడియోలకు ఉన్న క్రేజే వేరు. ఆయనకు ఫాలోయర్స్ కూడా ఎక్కువే. కేవలం టిక్ టాక్ లో వీడియోలు చేసి ఆయన సెలబ్రిటీ అయ్యాడు.

అందుకే ఆయన్ను బిగ్ బాస్ సీజన్ 3 లో తీసుకోవాలని అనుకుంటున్నారట. ఇప్పటికే కొందరు కంటెస్టెంట్లను బిగ్ బాస్ యాజమాన్యం ఎంపిక చేసినట్లు తెలుస్తుండగా.. తాజాగా ఉప్పల్ బాలును కూడా బిగ్ బాస్ సీజన్ 3లో తీసుకోవాలని యోచిస్తున్నారు.. అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఉప్పల్ బాలుతో మాటీవీ యాజమాన్యం చర్చలు కూడా జరిపిందని… ఆయన కంటెస్టెంట్ల లిస్ట్ లో ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి.

అయితే.. ఆ వార్తలపై ఉప్పల్ బాలు స్పందించారు. నేను బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ల లిస్టులో లేను. నన్ను ఇంతవరకు బిగ్ బాస్ 3 నిర్వాహకులు కానీ.. మాటీవీ యాజమాన్యం కానీ సంప్రదించలేదు. బిగ్ బాస్ సీజన్ 3 లో అవకాశం వచ్చే వెళ్లడానికి నేను రెడీ.. కానీ.. నాకైతే ఇప్పటి వరకు పిలుపు రాలేదు. భవిష్యత్తులో వస్తే వెళ్తా.. అంటూ ఆయన సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు పుల్ స్టాప్ పెట్టారు.

ఏమో.. బిగ్ బాస్ సీజన్ 3 కి ఇంకా కంటెస్టెంట్లను ఎంపిక చేసుకునే పనిలోనే ఉందట మాటీవీ యాజమాన్యం. ఇప్పటికే కొందరు సెలబ్రిటీలను ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఉప్పల్ బాలుకు కూడా పిలుపు రావచ్చేమో వేచి చూద్దాం.

మరోవైపు బిగ్ బాస్ 3 హోస్ట్ గా నాగార్జునను ఎంపిక చేశారు. మొదటి సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్, రెండో సీజన్ కు నాని వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

కంటెస్టెంట్లలో కూడా వరుణ్ సందేశ్, సింగర్ హేమ చంద్ర, సోషల్ మీడియా స్టార్ గాయత్రి గుప్తా, యాంకర్ శ్రీముఖి, తీన్ మార్ వార్తలు యాంకర్ సావిత్ర, యాంకర్ లాస్య, సీరియల్ నటుడు జాకీ, ఇంకా కొందరు నటులను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా బిగ్ బాస్ సీజన్ 3 లో మెరవనున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న బిగ్ బాస్ సీజన్ 3 కి సంబంధించిన టీజర్ ను కూడా బిగ్ బాస్ యాజమాన్యం నిన్న విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news