తెలంగాణలో కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదు.. పెద్ద బాంబు పేల్చిన కోమటిరెడ్డి.. బీజేపీలో చేరడం ఖాయమా?

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పని అయపోయిందని.. అందుకే తెలంగాణలోని కాంగ్రెస్ నేతలంతా బీజేపీ వైపు చూస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయిందనడానికి వరుసగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమే చెబుతోందని ఆయన స్పష్టం చేశారు.

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదట. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అంటూ ఆయన పెద్ద బాంబు పేల్చారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పని అయపోయిందని.. అందుకే తెలంగాణలోని కాంగ్రెస్ నేతలంతా బీజేపీ వైపు చూస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయిందనడానికి వరుసగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమే చెబుతోందని ఆయన స్పష్టం చేశారు.

అంతే కాదు.. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు పెద్ద తప్పు చేశారని అన్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జ్ కుంతియాపై కూడా ఆయన మండిపడ్డారు.

చంద్రబాబుతో చేతులు కలిపి పార్టీని చేజేతులారా నాశనం చేసుకున్నాం. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి రాష్ట్ర నాయకత్వమే కారణం. ఉత్తమ్, కుంతియా వల్లే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయింది. 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరినా రాష్ట్ర నాయకత్వం స్పందించడం లేదు. కాంగ్రెస్ కు భవితవ్యం లేదనే నేతలంతా ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు.

కోమటిరెడ్డి బీజేపీలో చేరిక ఫిక్స్ అయిందా?

అయితే.. కోమటిరెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వెనుక వేరే ఉద్దేశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన బీజేపీలోకి వెళ్లేందుకు ఫిక్సయ్యారని… అందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటున్నారు. మరోవైపు బీజేపీ తెలంగాణపై దృష్టి కేంద్రీకరించడం.. ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి లాక్కునేందుకు ప్రయత్నిస్తుండటం… 2023లో తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుండటంతో పలు పార్టీల కీలక నేతలు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి బ్రదర్స్ తో పాటు మల్కజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కూడా బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news