‘టమోటా’తో ఎన్ని ఆరోగ్యప్రయోజనలో తెలుసా?

-

టమోటా.. ఈ కూరగాయ గురించి తెలియని వారు ఉండరు. ఇది లేనిదే ఏ వంటను కూడా వండలేము. టమోటాను కేవలం కూరలోకి మాత్రమే వేస్తారు అనుకుంటే పొరపాటే.. టమోటాతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయ్. అవి ఏంటి అనేది మనం ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

టమోటాలో యాంటీ ఆక్సిడెంట్ లైకోపిన్ యొక్క ప్రధాన ఆహార వనరు గుండె జబ్బులు, క్యాన్సర్ ను తగ్గించడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయ్.

టమోటాలో విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్, విటమిన్ కె వంటి గొప్ప మూలకం ఉంది. టమోటాలో 95 శాతం నీటిని, 5% కార్బోహైడ్రేట్స్, ఫైబర్ ఉన్నాయ్.

ఇక ఈ టమోటలో ఉండే కెరోటినాయిడ్స్ మహిళలను రొమ్ము క్యాన్సర్ నుంచి కాపాడుతాయ్.

టమోటాలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇది వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి సమస్యల నుంచి కూడా కాపాడుతుంది.

టమోటాల్లో ఉండే విటమిన్ దృష్టిని మెరుగు పరుస్తుంది. అంతేకాదు టమోటాలో ఉండే విటమిన్ ఏ మీ జుట్టును దృడంగా కాంతివంతంగా చేస్తుంది.

టమోటాలు ఎక్కువగా తీసుకునే వారిలో మూత్రపిండాలలో రాళ్లు చాలా తక్కువ సంఖ్యలో ఏర్పడతాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

టమోటాల లో ఉండే విటమిన్ కె ఎముకలు బలంగా ఉండడానికి దోహదపడతాయి..

చూశారుగా మనం ప్రతి రోజూ వాడే టమోటా వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయ్ అనేది. మరి ఇంకేందుకు ఆలస్యం ఎక్కువగా ఇది ఉపయోగించడానికి ప్రయత్నించండి.

Read more RELATED
Recommended to you

Latest news