జీమెయిల్ వాడ‌తారా.. ఈ సూప‌ర్ ఫీచ‌ర్ గురించి తెలుసుకోండి!

-

ప్ర‌స్తుతం జీమెయిల్ అనేది ప్ర‌తి ఒక్క‌రికీ అవ‌స‌రంగా మారిపోయింది. ఫైల్స్‌, డాక్యుమెంట్లు సెండ్ చేయాలంటూ జీమెయిల్ అనేదే బెస్ట్ ఆప్ష‌న్‌. అయితే ఎప్ప‌టి క‌ప్పుడు స‌రికొత్త ఫీచ‌ర్ల‌న తీసుకొస్తూ అబ్బుర ప‌రుస్తున్న గూగుల్‌.. ఇప్పుడు జీమెయిల్‌లో సూప‌ర్ ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం.

జీ మెయిల్​కు వచ్చిన ఫొటోలను నేరుగా గూగుల్ ఫొటోస్​లో సేవ్​ చేసుకునే ఆప్షన్​ను తీసుకొస్తోంది గూగుల్‌. దీంతో మ‌న మెయిల్​కు వచ్చిన ఫొటోలను మాన్యువల్​గా డౌన్​లోడ్ చేయాల్సిన ప‌ని ఉండ‌దు. అలాగే వాటిని మళ్లీ గూగుల్ ఫొటోస్​లో అప్​లోడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు.

అంటే నేరుగా జీమెయిల్​ నుంచి ఫోటోల‌ను గూగుల్ ఫొటోస్ స్టోర్‌కు పంపొచ్చ‌న్న మాట‌. ఇక నుంచి ఫొటోపై డౌన్​లోడ్ బటన్ పక్కనే.. యాడ్ ‘టూ డ్రైవ్’ అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. దానిపై క్లిక్ చేయ‌గానే ఫొటోస్ డ్రైవ్‌లోకి వెల్లిపోతాయి. అయితే ఈ ఫీచ‌ర్ ప్రస్తుతానికి కొన్ని ప్రాంతాల్లో ఉంది. రానున్న కాలంలో అన్ని ప్రాంతాల్లోకి తీసుకొస్తుంది గూగుల్‌.

Read more RELATED
Recommended to you

Latest news