ఏటీఎం మెషిన్ ను కేవలం డబ్బులను డ్రా చేసుకోవడానికి వాడుతారు.ఇప్పుడు బంగారంను కూడా డ్రా చేసుకొనె మేషన్ లు కూడా అందుబాటులోకి వచ్చాయి.గోల్డ్ ఇచ్చే ఏటీఎం లు ఇప్పుడిప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. దాదాపుగా చాలా మంది ఏటీఎం కు డబ్బులు డ్రా చేసుకోడానికే వెళ్తారు..అక్కడ కావలసిన డబ్బు డ్రా చేసుకున్న తర్వాత ఇతరులు మన అకౌంట్ వివరాలు తెలుసుకొని డబ్బులు కాజేస్తారేమోనన్న అనుమానంతో ట్రాన్సాక్షన్ ముగిసిన వెంటనే క్యాన్సిల్ లేదా ఏవో నెంబర్లు నొక్కి బయటకు వచ్చేస్తాము..
మన బ్యాంకు బ్యాలెన్స్ గానీ, ఇతర వివరాలు గానీ ఎవరికీ కనిపించకుండా జాగ్రత్త పడతాం. కానీ, అమెరికాలో మియామీ బీచ్‌లో ఏర్పాటు చేసిన ఓ ఏటీఎం మాత్రం కస్టమర్ల గుట్టంతా విప్పేస్తోంది. ఒకసారి దానిలో కార్డు పెట్టి ఎదురుగా నిల్చుంటే చాలు.. కస్టమర్ ఫొటో తీసి.. అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉందో ఏటీఎం పైన ఏర్పాటు చేసిన లీడర్ బోర్డుపై అందరికీ కనిపించేలా డిస్ప్లే అవుతోంది.
బ్యాలెన్స్ పక్కనే కస్టమర్ ఫొటో కూడా ఉంటుంది. అంతే కాకుండా ఎక్కువ బ్యాలెన్స్ ఉన్న కస్టమర్ పేరు మొదటి స్థానంలో ఉండి.. ఆ తర్వాత బ్యాలెన్స్ వారీగా కస్టమర్ల పేర్లనూ చూపిస్తోంది..ఇది ఎలా సాధ్యం అనే సందేహం వస్తుంది కదూ..అయినా కూడా మీరు విన్నది అక్షరాల నిజం..న్యూయార్క్‌కు చెందిన ఎమ్ఎస్సీహెచ్ఎఫ్ సంస్థతో కలిసి పెర్రోటిన్గ్యాలరీ అనే సంస్థ అభివృద్ధి చేసింది. దీనిని మియామీ బీచ్‌లోని ఆర్ట్ గ్యాలరీలో ఉంచారు.
సాధారణ ఏటీఎంలో లాగానే ఇందులోనూ డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చట. వెరైటీగా ఉన్న ఈ ఏటీఎంకి జనాలు ఎగబడుతున్నారు. ఈ క్రమంలో కొందరు ఏటీఎంలో కార్డు పెట్టి.. ముఖం కనిపించకుండా కవర్ చేస్తే’ డబ్బులు డ్రా చేయడానికి ట్రై చేశారు..దానికి ఆ మెషిన్ బ్లడీ బాయ్స్ అంటూ ఒక మెసేజ్ ను పంపుతుంది..అది చూసిన వారంతా కూడా నవ్వకుండా ఉండరు.. మొత్తానికి ఎదో మ్యాజిక్ లాగా ఈ మేషన్ ఉండటంతో జనాలు ఎగబడుతున్నారు..
https://www.instagram.com/reel/ClpDv25rAHE/?igshid=YmMyMTA2M2Y=