వైరల్ వీడియో.. బేబి డ్రాగన్లు.. పర్యాటకుల సందడి..!

-

డ్రాగన్లను సినిమాల్లో తప్ప నిజ జీవితంలో కనిపించవు. పిల్లల పుస్తకాల్లో.. చైనా పురాణాల్లో మాత్రమే కనిపించే డ్రాగన్లు నిజంగానే ఉన్నాయని అంటున్నారు శాస్త్రవేత్తలు. చైనీయుల సాంప్రదాయంలో ప్రజల ప్రాణాలు కాపాడుతూ.. గాల్లో ఎగురుతూ నోటి నుంచి నిప్పులు కక్కే డ్రాగన్లలా మాత్రం కాదు. ఇవి ఒకరకమైన సాలమండర్లు. పురాతన జాతికి చెందిన డ్రాగన్లు ఇవి. చైనాలోని స్లొవేనియాలోని పోస్తోజ్నా గుహలో వీటిని గుర్తించారు.

dragons
dragons

ఆడ సాలమండర్ 2016లో ఓ ఎక్వేరియంలో 64 గుడ్లు పెట్టింది. వీటిని అక్కడి ప్రభుత్వం ల్యాబ్ కి తరలించి పొందిగించింది. ఈ గుడ్లలో 22 పిల్లలు మాత్రమే బయటకు వచ్చాయి. వీటిలో కొన్ని మాత్రమే బతికాయి. మిగిలినవి చనిపోయాయని నిర్వాహకులు తెలిపారు. 4 ఏళ్లుగా సాలమండర్ పిల్లలను జాగ్రత్తగా గుహలోని నీటిలో ఉంచి వాటిని కాపాడుతున్నారు. ప్రస్తుతం ఆ గుహను పర్యాటకుల కోసం తెరవడంతో ఈ బేబీ డ్రాగన్లను చూడటానికి పర్యాటకులు తరలివస్తున్నారు. దీంతో పర్యాటక సిబ్బంది రోజుకి 30 మందిని మాత్రమే అనుమతిస్తున్నారు.

100 ఏళ్ల వరకు బతికే ఈ డ్రాగన్లు జీవితాంతం నీటిలోనే ఉంటాయి. పర్యాటకుల కోసం మాత్రం గుహలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆక్వేరియంలో మూడు బేబీ డ్రాగన్లను ఉంచారు. కొన్ని శతాబ్దాలుగా ఈ గుహ బయోడైవర్శిటీగా కొనసాగుతోంది. దీనికి మంచి పేరు ఉంది. ఈ బయోడైవర్శటీలో పాతకాలం నాటివి, కొత్త కొత్త జీవులు పుట్టగలుగుతున్నాయని, వాటిలో ఈ బేబీ డ్రాగన్లు ప్రత్యేకమైనవని శాస్త్రవేత్తలు అంటున్నారు.

భూమిపై మళ్లీ ఈ డ్రాగన్లు రావడం ఎంతో సంతోషంగా ఉందని డ్రాగన్ నిర్వాహకుడు కట్టా డోలెంకా అన్నాడు. బేబీ డ్రాగన్లు పొదిగేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపడం జరిగిందని, వీటి పోషణకు ఎంతో బాధ్యతగా తీసుకున్నానన్నారు. శ్రమకు తగిన ప్రతిఫలం దొరికిందని సంతోషం వ్యక్తం చేశాడు. బేబీ డ్రాగన్లను చూడటానికి పర్యాటకులు ఆసక్తి చూపడం సంతోషంగా ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news