సోషల్ మీడియాను ఊపేస్తున్న డైపర్ క్రికెటర్… జానెడు లేడు… వైరల్ వీడియో.

-

ముఖ్యంగా పిల్లల్లో క్రికెట్ మీద ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. చేతికి బ్యాట్ దొరికితే చాలు క్రికెట్ అంటూ పరిగెడుతూ ఉంటారు. ఇప్పుడు అంటే పిల్లల చేతుల్లోకి స్మార్ట్ ఫోన్ వచ్చి అంతా నాశనం చేసింది గాని గతంలో అయితే ఎక్కువగా పిల్లలు క్రికెట్ ఆడుకుంటూ సందడి చేసే వారు. తల్లి తండ్రులు కూడా వారి ప్రతిభను గుర్తిస్తూ ఉండే వారు. ఇప్పుడు గతంలో అంత లేదు గాని క్రికెట్ మీద ఆసక్తి ఉన్న పిల్లలను తల్లి తండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. వారి నైపుణ్యాన్ని గుర్తించి వారికి సరైన శిక్షణ ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు.

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇక వాళ్ళు ఆడిన ఆటను వీడియో రూపంలో పోస్ట్ చేస్తూ ప్రతిభను ప్రపంచానికి చూపిస్తున్నారు. తాజాగా ఒక చిన్నారి… వీడియోని ఇలాగే పోస్ట్ చేశారు. ఫాక్స్‌ క్రికెట్‌ సంస్థ తమ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో ఒక చిన్నారి క్రికెట్ ఆడుతూ ఉంటాడు. టీషర్టు, డైపర్‌ ధరించిన ఆ బుడ్డాడు… బ్యాటు పట్టుకుని ఇంట్లో క్రికెట్‌ ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా ఆడుతూ ఉంటాడు. గ్లౌవ్స్‌ కూడా ధరించి లాంగ్‌ ఆన్‌ షాట్లు, స్ట్రైట్‌ డ్రైవ్స్‌ ఆశ్చర్యపోయే ఫుట్ వర్క్, దిగ్గజ ఆటగాళ్లకు సైతం కుదరని స్టైల్లో తాను ఆడటం చూసి క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయింది.

అతనిలో నైపుణ్యాన్ని చూసిన క్రికెట్ అభిమానులు అయితే త్వరగా క్రికెట్ లోకి వచ్చేసేయ్… చదువు కూడా పక్కన పెట్టేసేయ్… నీ కోసం పిచ్ లు సిద్ధంగా ఉన్నాయి, పేస్ బౌలర్లు నీ వికెట్ కోసం ఎదురు చూస్తున్నారు… మీ అమ్మా నాన్నకు చెప్పు… నాకు క్రికెట్ ప్రపంచం ఉంది డిస్టర్బ్ చేయొద్దని అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ కూడా అతని ఆట చూసి వీడియో ని తాను కూడా పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఈ వీడియో వరల్డ్ వైడ్ ట్రేండింగ్.

Read more RELATED
Recommended to you

Latest news