అఖిల్‌తో అన్నపూర్ణ స్టూడియోలో సందడి చేసిన కోహ్లీ

-

వచ్చే శుక్రవారం వెస్టిండిస్‌తో ఉప్పల్ స్టేడియంలో రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది తెలుసు కదా. ఆ మ్యాచ్ కోసం నిన్ననే భారత్, వెస్టిండిస్ ప్లేయర్స్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. అయితే.. విరాట్ కోహ్లీ మాత్రం తన భార్య అనుష్క శర్మతో.. ప్లేయర్ల కంటే ముందే హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యాడట. అనంతరం జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోకు వెళ్లాడట. అక్కడ ఓ యాడ్ షూటింగ్‌లో పాల్గొన్నాడట. ఆ సమయంలోనే విరాట్ కోహ్లీ.. హీరో అఖిల్‌ను కలిశాడట. ఇద్దరు కలిసి కాసేపు ముచ్చటించుకున్నారు. వాళ్లిద్దరు కలిసి ముచ్చటించుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

నిజానికి.. అఖిల్‌కు కూడా క్రికెట్ అంటే ప్రాణం. సెలబ్రిటీ ప్రీమియర్ లీగ్‌లో తెలుగు వారియర్స్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు అఖిల్. చదువుకునే రోజుల్లోనే క్రికెట్ కోసం ప్రత్యేకంగా ట్రెయినింగ్ కూడా తీసుకున్నాడు అఖిల్. ఆ క్రికెటే ఇద్దరినీ కలిపిందేమో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news