ఏరోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే.. మంచి ఫలితాలు మీ సొంతం!

-

భూమ్మీద ఉండే ప్రతిరంగుకూ ఓ ప్రత్యేకత, గొప్పతనం ఉంటుంది. ఈ రంగులు వ్యక్తి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఒక్కో రంగును బట్టి మనిషిలోని భావాలను తెలుపుతాయి. ఈ రంగులకు రోగాలను నయం చేసే గుణం కూడా ఉంది. దీనినే కలర్ థెరపీ అంటారు. ఏరోజు ఎలాంటి రంగు దుస్తులు వేసుకోవాలో తెలుసుకోండి. ఫలితం కనబడుతుంది.

సోమవారం : సోమవారం అంటే చంద్రునికి ప్రతీక. కాబట్టి ఈ రోజునాడు తెల్లటి వస్ర్తాలను ధరిస్తే మంచిది.

మంగళవారం : ఈ రోజు హనుమంతుని రోజుగా భావిస్తారు చాలామంది. హనుమంతుని విగ్రహాలను కాషాయం రంగులో చూస్తుంటాం. కాబట్టి మంగళవారం నాడు ప్రత్యేకంగా కాషాయం రంగు కలిగిన వస్త్రాలను ధరించండి. ఫలితం ఉంటుందంటున్నారు జ్యోతిష్యులు.

బుధవారం : వారంలో మూడవరోజు గణాధిపతికి సంబంధించిన రోజు. విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరునికి ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టం. కాబట్టి బుధవారం నాడు పచ్చరంగు కలిగిన వస్ర్తాలను దరించండి.

గురువారం : గురువారాన్ని బృహస్పతి వారం అనికూడా అంటారు. ఈ రోజున గురువులకు అధిపతి అయిన బృహస్పతి దేవుడు అలాగే షిరిడీ సాయిబాబాకు మహాప్రీతి. బృహస్పతి దేవునికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ రోజున పసుపు రంగు వస్ర్తాలను ధరించండి.

శుక్రవారం : ఈ రోజు అమ్మవారుకు సంబంధించిన రోజు. అమ్మవారు జగజ్జననీ. ఆమె సర్వాంతర్యామి. కాబట్టి ఈ రోజున అన్ని రంగుల మిశ్రమం ఉన్న వస్ర్తాన్ని ధరించండి.

శనివారం : శనిదేవునికి సమర్పించే ఈ రోజున నీలి రంగు కలిగిన వస్ర్తాలను ధరించండి.

ఆదివారం : ఈరోజు సూర్యుడిని ప్రార్థిస్తారు. ఈ రోజున గులాబీరంగు కలిగిన వస్ర్తాలను ధరించండి. కొన్ని రంగులు నచ్చుతుంటాయి. అనాయాసంగా ఆయా రంగుల పట్ల ఆకర్షితులమౌతుంటారు. దీనినే కలర్ సైన్స్ అంటారు. కానీ జ్యోతిష్యాన్ని నమ్మేవారు రోజుననుసరించి రంగు దుస్తులను ధరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news