ఇంట్రావర్ట్స్ ప్రేమలో పడితే ఏ విధంగా ప్రవర్తిస్తారో తెలుసా?

Join Our Community
follow manalokam on social media

నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ మాట ప్రేమించిన వారితో చెప్పాలని ఉన్నా కూడా వెనకడుగు వేస్తారు. సాధారణంగా మామూలు టైమ్ లో గలగల మాట్లాడే వాళ్ళు ప్రేమలో పడగానే ఆ విషయాన్ని చెప్పడానికి జంకుతారు. ఇక పెద్దగా మాట్లాడని ఇంట్రావర్ట్స్ తమ ప్రేమని ఎలా తెలియజేస్తారు. ఇంట్రావర్ట్స్ ప్రేమిస్తే ఎలా ప్రవర్తిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్రావర్ట్స్ గతం గురించి ఆలోచించరు. ప్రేమలో పడ్డాక భవిష్యత్తు కోసమే ఆలోచిస్తారు. గతం ఎలాంటిదైనా దాన్ని పెద్దగా పట్టించుకోరు.

వారి ఊహా ప్రపంచంలో ప్రేమ గురించి కొన్ని వందల కథలని సృష్టించుకుంటారు.

ప్రేమించిన వారికి బహుమతులు ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తారు.

సినిమాల్లో ప్రేమికుల మధ్య వచ్చే పాటల్లో తమని తాము ఊహించుకుంటారు.

తాము ప్రేమించిన వారిని ఇతరులతో చూసినపుడు జెలసీగా ఫీల్ అవుతుంటారు.

వారు సోషల్ మీడియాలో పెద్దగా ఆక్టివ్ గా ఉండరు. కానీ తాము ప్రేమించిన వారి పూర్తి సమాచారం వారి దగ్గర ఉంటుంది.

వాళ్ళు తాము ప్రేమించిన మాటలు కేవలం వినడమే కాదు. వారి హావాభావాల్ని బాగా గమనిస్తారు. వారెప్పుడూ ఏ విధంగా ప్రవర్తిస్తున్నారనేది బాగా అబ్జర్వ్ చేస్తుంటారు.

ప్రేమించిన వారు చిన్నగా మాట్లాడిన చాలు గాల్లో ఎగిరినట్టుగా ఫీల్ అవుతారు. వారు చూసే చిన్న చూపు కూడా ఏదోలా ఫీల్ అవుతారు.

వారి గురించి పెద్దగా ఎవరితో పంచుకోకపోయినా, ప్రేమించినవారితో మాత్రం అన్నీ చెబుతారు. అదే కాదు సలహాలు ఇవ్వమని అడుగుతారు కూడా.

అవతలి వాళ్ళు పెద్దగా పట్టించుకోవడం లేదని తెలిసినపుడు మరీ ఎక్కువగా ఆలోచిస్తారు. ఎందుకిలా ప్రవర్తిస్తున్నారని ఏడుస్తారు.

TOP STORIES

ఈ నీలి రంగు గెలాక్సీ ఎంత అందంగా ఉంది : నాసా

గెలాక్సీలో ఎంతో వింతలు చోటు చేసుకుంటాయి. వాటిని చూడాలని అందరూ ఎంతో ఆతురతగా ఎదురు చూస్తుంటారు. ఇటీవల అంగారక గ్రహంపై అడుగు పెట్టిన నాసా.. ల్యాండింగ్...