ఇండియా – పాక్ మధ్య అణు యుద్ధం వస్తే.. ఏమౌతుందో తెలుసా…?

-

ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయిఇది ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.ఈ నేపథ్యంలో అసలు ఇండియా– పాక్ మధ్య యుద్ధం అంటూ వస్తే ఎలా ఉంటుందిఒకవేళ అణు యుద్ధం జరిగితే ఏమవుతుంది.. అనే అంశంపై అమెరికాలోని కొలరాడో బౌల్డర్‌ అండ్‌ రట్జర్స్‌ యూనివర్సిటీకి చెందిన కొందరు పరిశోధకులు పరిశోధన చేశారువారు చెప్పింది వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది.

ఇండియాపాక్ అణుయుద్ధం గురించి వారు ఏంచెబుతున్నారంటే.. భారత్‌పాకిస్థాన్‌ మధ్య అణుయుద్ధమంటూ జరిగితే.. వారం రోజుల్లోపే కోట్ల నుంచి 12.5 కోట్ల మంది దాకా ప్రాణాలు కోల్పోతారటఎందుకంటే.. రెండు దేశాల వద్దా చెరో 150 దాకా అణు వార్‌హెడ్లు ఉన్నాయి. 2025 నాటికి ఆ సంఖ్య 200-250కి చేరొచ్చుఅప్పుడు గనక యుద్ధం జరిగితే మరణాల రేటు రెట్టింపు అవుతుందటకేవలం ప్రాణ నష్టమే కాదు.. అణుధార్మిక ప్రభావానికి గురయి సుదీర్ఘకాలం అనారోగ్యంతో బాధపడి చనిపోయేవారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందట.

అంతే కాదు.. ప్రపంచం మీద ఈ యుద్ధ ప్రభావం చాలా ఉంటుందటప్రకృతిపై ఆ యుద్ధం వేసే ముద్ర బీభత్సమటఅసలు ఇలాంటి యుద్ధాన్ని ఇంతవరకు మానవజాతి చవిచూసి ఉండబోదంటున్నారుఅణుబాంబులు పేలడం వల్ల వాటి నుంచి వెలువడే 16 నుంచి 36 మిలియన్‌ టన్నుల నల్లటిసూక్ష్మమైన కార్బన్‌ అణువులు వాతావరణంలో పై భాగానికి చేరి వారం రోజుల్లో విశ్వమంతా వ్యాపిస్తుందటఆ పరిస్థితి రాకూడదని కోరుకుందాం.

Read more RELATED
Recommended to you

Latest news