పక్షి కుటుంబం కోసం ఆ ఊరంతా 45 రోజులు అంధకారంలోనే..

-

ఒకప్పుడు ఊర పిచ్చుకలు ఇళ్లల్లో, ఇంటి పరిసరాల్లోనే జీవనం సాగిస్తు కిటకిటలాడేవి. పల్లేల్లో బయటకు వస్తే చాలు చెట్లపై ఇళ్లపై వేల సంఖ్యల్లో పిచ్చుకలు కనిపించేవి. ఉదయం వాటి శబ్దాలతోనే మొదలయ్యేది. ఎప్పుడైతే పంట పొలాల్లో పురుగుల మందు వాడకం మొదలైందో పిచ్చుకల పతనం మొదలైంది. ఆ తర్వాత పుట్టగొడుగుల్లా వెలిసిన సెల్‌ఫోన్‌ టవర్ల కారణంగా అసలు పిచ్చుకలనేవే లేకుండా పోతున్నాయి. ఇలాంటి తరుణంలో ఒక ఊరపిచ్చుక కోసం ఊరికి ఊరే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 45 రోజులు అంధకారంలో ఉన్నారంటే నమ్మడానికి మనసు ఒప్పుకొకున్నా ఈ వర్త చదివాక ఒప్పు కోవాల్సిందే.

ఊరంతా ఒకే మాటపై..

అంతరించిపోతున్న ఊర పిచ్చుకల జాతిని కాపాడాలనే తపనే వారు ఈ నిర్ణయానికి పూనుకున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని శివగంగే జిల్లా పోతకూడి గ్రామానికి 45 రోజుల ముందు ఈ గ్రామానికి ఎక్కడి నుంచో ఓ పిచ్చుక వచ్చి ఆ ఊరి స్ట్రీట్‌లైట్‌ మేయిన్‌ స్విచ్‌బోర్డులో దూరింది. మెల్లిమెల్లిగా ఆ బోర్డులోనే గూడుకట్టుకోవడం ప్రారంభించింది. అది తెలిసిన ఆ గ్రామçస్థులంతా ఆ స్తంభానికున్న బోర్డు వద్దకు చేరారు. అది గుడ్లు పెట్టేందుకు సిద్ధం చేసుకున్నట్లు గ్రహించారు. ఆ గూడు చెడపకుండా, అధికారులను పిలిపించారు.

మేయిన్‌స్విచ్‌ ఆన్‌చేస్తే గూడు కాలిపోతుందని ఇకపై మా ఊర్లో విద్యుత్‌ లేకున్నా ఫర్యాలేదు. బోర్డును మాత్రం తెరవరాదని తేల్చి చెప్పేశారు. దీంతో అప్పటి నుంచి అధికారులు ఆ గ్రామానికి విద్యుత్‌ నిలిపివేశారు. కొన్ని రోజుల తర్వాత ఆ పిచ్చుక ఆ బోర్డులోని గూడులో మూడు గుడ్లు పెట్టి పొదగగా రెండు పిల్లలు జన్మించాయి. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు చాలా ఆనందం పడ్డారు. ఆ పక్షి పిల్లలకు రెక్కలు వచ్చి ఎగిరేంత వరకు గ్రామస్థులు ఎవరూ అటువైపు వెళ్లరాదని నిర్ణయించుకున్నారు. ఆ గ్రామస్థులు ఒక్క పిచ్చుక కుటుంబం కోసం చూపిన ప్రేమసోషల్‌ మీడియాలో హల్‌చల్‌ కావడంతో పక్షి ప్రేమికులు వారిని అభినందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news