అతడి గుండె నన్ను బీరు తాగమంటోంది.. నేనేం చేయాలి..!

-

బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ వింత ప్రవర్తన ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎప్పుడూ అలవాటు లేని బీరు ఆమెకు ఇప్పుడు తాగాలనిపిస్తోందట. అయితే.. ఆమెకు అలా అనిపించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి..

ఆమె పేరు షెరాన్ విలియమ్సన్.. ఆమెకు అరుదైన వ్యాధి సోకింది. దాని పేరు గెయింట్ సెల్ మయోకాైర్డెటిస్. దాని వల్ల ఆమె గుండె రోజు రోజుకూ ఉబ్బిపోయేది. రెండు సార్లు సర్జరీ కూడా చేశారు. కానీ.. ఫలితం శూన్యం. దీంతో గుండె మార్పిడి చికిత్స చేయాల్సిందేనని.. లేకపోతే ఆ మహిళ ప్రాణాలు కాపాడటం కష్టమని డాక్టర్లు తేల్చారు.

అయితే.. అదృష్టవశాత్తు ఆమెకు బ్రెయిన్ డెడ్ అయిన ఓ సైనికుడి గుండె మ్యాచ్ అవడంతో.. ఆమెకు గుండె మార్పిడి చికిత్స చేశారు. ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది. ఆమె మరో జన్మ ఎత్తింది. కానీ.. ఆపరేషన్ తర్వాత ఆమె ప్రవర్తనలో మాత్రం కొన్ని మార్పులు వచ్చాయి. ఇదివరకు ఎప్పుడూ బీరు వాసన చూడని ఆ మహిళ.. ఆపరేషన్ తర్వాత బీరు అంటేనే పడి చచ్చిపోతోంది. తనకు బీర్ తాగాలనే కోరిక కలుగుతోందని.. నేను ఆ కోరికను ఆపుకోలేకపోతున్నానంటూ తెలిపింది. అయితే.. ఇది సైనికుడి గుండె ప్రభావం అయి ఉండొచ్చని.. ఇలా ట్రాన్స్‌ప్లంటేషన్ ఆపరేషన్లు చేసినప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కామన్ అని డాక్టర్లు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news