సెహ్వాగ్‌ను ఫిదా చేసిన ఈ ఫోటో స్పెషాలిటీ ఏంటో తెలుసా?

ఫీల్డ్‌లోకి క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ దిగాడంటే మెరుపులే. టపా టపా కొట్టుడే. ఆయితే ఫోర్ లేదా సిక్స్ అంతే. అందుకే ఆయన్ను డాషింగ్ ఓపెనర్ అని అంతా పిలుస్తారు. ఆ వీరేందర్ సెహ్వాగ్‌కు ఓ ఫోటో నచ్చింది. దానికి ఫిదా అయిపోయాడు. ఎంతలా అంటే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అంది. ఎందుకు.. ఏమిటి.. ఎలా అంటే మనం ఇంకాస్త ముందుకెళ్లాల్సిందే.

మీరు పైన చూస్తున్నారు కదా.. అదే ఫోటో. ఆ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసి దానికి ఏం క్యాప్షన్ పెట్టాడో తెలుసా? రిక్షా తొక్కే వ్యక్తి ఇంజినీరింగ్ గ్రాడుయేట్. పేరు హిసాముద్దీన్ ఖాన్. తండ్రి రిక్షా పుల్లర్. హిసాముద్దీన్ ఇంజినీరింగ్ కాన్వకేషన్ పూర్తయిన తర్వాత తన తల్లిదండ్రులను రిక్షాలో కూర్చోబెట్టుకొని తన స్వయంగా తొక్కుకుంటూ ఇంటికి తీసుకెళ్తున్నాడు. ఇంతకంటే ఓ తల్లిదండ్రికి ఇంకేం కావాలి. బ్యూటిఫుల్ అంటూ ట్వీట్ చేశాడు. అంతే.. ఆ ఫోటో ఒక్క సెహ్వాగ్‌నే కాదు.. నెటిజన్లను కూడా ఫిదా చేసేసింది. వావ్.. సూపర్.. కొడుకంటే నీలా ఉండాలి బాస్. రిక్షా తొక్కే వ్యక్తి కొడుకువైనా.. ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగావు.. సూపర్. నీలాంటోళ్లనే నేటి యువత ఆద్శంగా తీసుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు.

అంతా బాగానే ఉంది కానీ.. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది. వీళ్లది ఏఊరు.. అని మీరు అడుగుతారని తెలుసు. అందుకే వాళ్ల డిటెయిల్స్ అన్నీ తీసుకొచ్చేశాం. వాళ్లది బంగ్లాదేశ్‌లోని ఢాకా. అక్కడి యూనివర్సిటీలోనే హిసాముద్దీన్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అదీ మ్యాటర్.