పెళ్లి అనేది మానవ జీవితంలో చాలా ముఖ్యమైంది.. జీవితంలో ఒకరితోనే, ఒకేసారి చేసుకోవాలని పెద్దలు అంటారు.. కానీ ఇది ఒకప్పటి మాట.. కానీ ఇప్పుడు మాత్రం అలా లేదు.. నచ్చితే కాపురం చేస్తున్నారు.. లేదు అంటే మాత్రం విడాకులు తీసుకొని విడిపోతున్నారు.. ఇక విషయానికొస్తే.. ఓ మహిళ తనకు విడాకులు రావడం చాలా సంతోషంగా ఫీల్ అవుతూ సెలెబ్రేట్ చేసుకుంది.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
లారెన్ బ్రూక్ అనే మహిళ తన విడాకుల ఫోటోషూట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. అది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనియాంశంగా మారింది.. ఆ ఫోటోలలో ఆమె తన పెళ్లి దుస్తులను తగలబెట్టడం, ఆమె వివాహ ఫోటో ఫ్రేమ్‌ను పగులగొట్టడం, అలాగే చిత్రాన్ని చింపివేయడం చూపిస్తుంది..ప్యూబిటీ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిన పోస్ట్ 500,000 కంటే ఎక్కువ లైక్‌లను సంపాదించింది.. సోషల్ మీడియాలో వైరల్గా మారింది…
లారెన్ బ్రూక్ అనే మహిళ అందమైన ఎరుపు రంగు దుస్తులు ధరించి, ‘విడాకులు’ అని రాసి ఉన్న బ్యానర్‌ను పట్టుకుని ఫోటోలకు పోజులిచ్చింది. ఫోటో షూట్ నుండి ఎనిమిది ఫోటోగ్రాఫ్‌లలో, బ్రూక్ తన మాజీతో తన పోర్ట్రెయిట్‌ను చింపివేయడం, తన వివాహ ముసుగును నిప్పంటించడం, ఆమె వివాహ ఫోటో ఫ్రేమ్‌ను ఆమె బూట్లతో పగలగొట్టడం మరియు ఆమె పెళ్లిపై నిలబడి షాంపైన్ బాటిల్‌ను పాప్ చేయడం వంటివి చూడవచ్చు..దీన్ని చూసిన నేటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు…మీరు ఆ ఫోటోలను ఒకసారి చూడండి..
View this post on Instagram