శృంగారంలో బూతు మాటలు.. కరెక్టేనా?

శృంగారం అంటేనే బూతు అని నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే ఆ పేరు వినగానే ముసి ముసి నవ్వులు కనిపిస్తాయి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అశ్లీలం వేరు. శృంగారం వేరు. శృంగారానికి హద్దులు ఉండవు. ఎందుకంటే అది ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య జరిగే కార్యం. తమ ఇష్టాపూర్వకంగా జరుగుతుంది. అందుకే దానికి హద్దులు లేవు. పరస్పరం ఆనంద తీరాలను తాకుతూ దోసిళ్ళతో ఆనందాన్ని ఆస్వాదించడానికి హద్దులు పెట్టడం ఎందుకు. అందుకే శృంగారంలో బూతు మాటలను పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు.

సాధారణంగా ఉన్న సమయంలో వినడానికే ఇష్టం లేని పదాలు కూడా శృంగారంలో దొర్లే అవకాశం ఉంటుంది. ఐతే అది పెద్ద తప్పు కాదు. ఇరువురి మధ్య ఎలాంటి దాపరికాలు లేవని చెప్పడానికి అదొక సంకేతంలా అనిపిస్తుంది.

అవతలి వారిలో లేని దాన్ని కూడా ప్రేరేపించగలిగే శక్తి మాటలకు ఉంది. అలాగే శక్తిని దించగలిగే పవర్ కూడా మాటలకు ఉంది. ఐతే శృంగారంలో ఒకరు బూతు మాటలు మాట్లాడుతున్నప్పుడు అవతలివారు ఇబ్బందిగా ఫీలైతే వాటిని అక్కడితోనే ఆపేయడం మంచిది. ఎందుకంటే మీ మాటల వల్ల  మీ భాగస్వామిలో కోరిక చచ్చే అవకాశం ఉండవచ్చు.

మీ భాగస్వామి సున్నితత్వాన్ని బట్టి బూతు మాటలు ఉండాలి. లేదంటే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. ఆనందం స్థానే అనవసర ఇబ్బంది ఏర్పడవచ్చు. మీరిద్దరు బూతు మాటలను ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఎలాంటి నష్టం ఉండదు. అంటే మీ మాటలు మీ కార్యాన్ని ఈ విధంగా ప్రభావితం చేస్తున్నాయనేది మీరే నిర్ణయించుకోవాలి. అప్పుడే శృంగారాన్ని మరింత ఆనందించవచ్చు