ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం.. విశేషాలు.. థీమ్..

-

పొగతాగడం ఆరోగ్యానికి హానికరం. ప్రతీ సినిమా మొదలయ్యే ముందు వచ్చే ఈ మాటలు విని ఎంత మంది పొగ మానేస్తారో అర్థం కాదు. పొగ తాగడం వల్ల హానికరం అని తెలిసి కూడా మానలేకపోతున్నవారు చాలామంది ఉన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవమైన ఈ రోజున దాని విశేషాలు తెలుసుకుందాం.

ప్రపంచ ఆరోగ్య సంస్థ 1988లో పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకోవాలని తీర్మానించింది. ఈ మేరకు మే 31వ తేదీని ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఈ మేరకు ఈ రోజున పొగాకు వలన కలిగే ఇబ్బందులు, ఏర్పడే ఆరోగ్య సమస్యలు, ఇంకా పొగాకు మానేయడానికి ఏం చేయాలో అవగాహన కార్యక్రమాలు జరుపుతారు. ఐతే ప్రస్తుతం మహమ్మారి విజృంభిస్తుంది. కరోనా కారణంగా ప్రజలు ఒక చోట కలిసే అవకాశం లేదు. అందువల్ల ఈ సారి అవగాహన కార్యక్రమాలన్నీ ఇంటర్నెట్ ద్వారానే జరుగుతున్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన ప్రకారం 2018లో పొగాకు బారిన పడి 8మిలియన్ల మంది మరణించారు. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద పొగాకు వినియోగదారుగా భారతదేశం ఉంది. 2021పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కమిట్ టు క్విట్ అనే థీమ్ నిర్ధారించారు. పొగాకు వల్ల కలిగే ఇబ్బందులు, దాన్ని మానేయడానికి అవగాహన కార్యక్రమాలు జరుపుతారు.

పొగాకు వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు, క్షయ, లంగ్ క్యాన్సర్, నోటి క్యాన్సర్ వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం భారతదేశంలో క్యాన్సర్ బారిన పడ్డ వారిలో 30శాతం మందికి పొగాకు కారణంగా ఉంది. దీన్ని బట్టి పొగాకు ఎంత దుష్ప్రభావాలు చూపుతుందో అర్థం చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news