ప్రపంచ నిద్రా దినోత్సవం.. తెలుసుకోవాల్సిన విషయాలు..

-

నిద్ర.. చాలా మందికి టైమ్ కి నిద్ర రాదు. బెడ్ పై అటూ ఇటూ పొర్లుతారే తప్ప నిద్రపోరు. దానికి చాలా కారణాలున్నాయి. మారుతున్న జీవన విధానాలు, అలవాట్లు మన మీద విపరీతంగా ప్రభావం చూపుతున్నాయి. రాత్రివేళ పనిచేయడాలు, పొద్దున్న పూట నిద్రపోవడాలు ఎక్కువవడంతో జీవనశైలి అస్తవ్యస్థం అయిపోయింది. రోజుకి 7-9గంటల నిద్ర అవసరం. ఎంత కాదనుకున్నా ఆ మాత్రం శరీరానికి విశ్రాంతి ఇవ్వగలిగితేనే పొద్దున్నపూట ఉత్సాహంగా ఉండగలుగుతారు.

మార్చి 19వ తేదీ ప్రపంచ నిద్రా దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం.

సరైన నిద్ర మనిషిని ఉత్సాహంగా ఉంచుతుంది. నిద్ర సరిగ్గా లేకపోతే మెదడు మీద ప్రభావం పడుతుంది. సరైన ఆలోచనలు రాకుండా అలసట ఎక్కువ అవుతుంది. అంతే కాదు రక్తప్రసరణ వేగంలో మార్పులు ఏర్పడి గుండెపోటుకి దారి తీసే అవకాశాలు ఎక్కువ. బరువు పెరగడం, ఊబకాయం వంటి సమస్యలు నిద్ర సరిగ్గా లేకపోవడం వల్లనే వస్తాయి. నిద్ర సరిగా లేకపోతే ఒత్తిడి ఎక్కువై నిరాశలోకి దారి తీస్తుంది. యాంగ్జాయిటీ సమస్యలు వస్తాయి.

తొందరగా నిద్రపోవడానికి పాటించాల్సిన చిట్కాలు

ప్రతీరోజు ఒకే సమయానికి పడుకోండి. మీరు బెడ్ మీదకి వెళ్ళే సమయం వేరు వేరుగా ఉండవద్దు. ఒక్కసారి బెడ్ మీదకి వెళ్ళారంటే ఫోన్ ని ముట్టుకోవద్దు.

ఆల్కహాల్, కెఫైన్ వంటివి తీసుకోకండి, అవి నిద్రని మాయం చేసే కారకాలు. తాగుతున్నప్పుడు మత్తుగా అనిపిస్తాయే తప్ప నిద్రని దూరం చేస్తాయి.

మీ బెడ్ రూమ్ ఉష్ణోగ్రత ఎలా ఉందో చూసుకోండి. నిద్రపోతున్నప్పుడు వెలుతురు ఉండకుండా చూడండి. నిద్రపోవడానికి ఒక గంట ముందు టీవీ గానీ, ఫోన్ గానీ ముట్టుకోవద్దు.

Read more RELATED
Recommended to you

Latest news