ప్రస్తుతం మనకు మార్కెట్‌లో షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ ఫోన్ రూ.10,999 ధరకు లభిస్తోంది. అయితే దీనిపై రూ.10,450 వరకు గరిష్ట ఎక్స్‌ఛేంజ్‌ను మనం పొందవచ్చు. దీంతో ఫోన్ ధర కేవలం రూ.549 మాత్రమే అవుతుంది.
ఆకట్టుకునే ఫీచర్లతో చాలా తక్కువ ధరలకే స్మార్ట్‌ఫోన్లను వినియోగదారులకు అందివ్వడంలో మొబైల్స్ తయారీ కంపెనీ షియోమీకి మంచి పేరుంది. అందుకే షియోమీ ఫోన్లను చాలా మంది ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు ఆ కంపెనీ తన ఫోన్లపై డిస్కౌంట్‌లను, ఆఫర్లను కూడా అందిస్తుంటుంది. అందులో భాగంగానే తాజాగా షియోమీ ఓ కొత్త ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఇప్పుడు ఆ కంపెనీకి చెందిన రెడ్‌మీ నోట్ 5 ప్రొ ఫోన్‌ను కేవలం రూ.549కే సొంతం చేసుకోవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. మరి అది ఎలాగంటే…
ప్రస్తుతం మనకు మార్కెట్‌లో షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ ఫోన్ రూ.10,999 ధరకు లభిస్తోంది. అయితే దీనిపై రూ.10,450 వరకు గరిష్ట ఎక్స్‌ఛేంజ్‌ను మనం పొందవచ్చు. దీంతో ఫోన్ ధర కేవలం రూ.549 మాత్రమే అవుతుంది. అయితే ఎక్స్‌ఛేంజ్ రూ.10,450 రావాలంటే.. లిస్ట్‌లో సూచించిన మేరకు అంత విలువ వచ్చే ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేయాలి. ఇక ఇతర ఫోన్లను ఎక్స్‌ఛేంజ్ చేస్తే అంత మొత్తం ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ రాకపోవచ్చు. మీరు ఎక్స్ ఛేంజ్ చేసే ఫోన్‌కు చెందిన విలువను బట్టి డిస్కౌంట్ ఇస్తారు. అయితే రూ.10,450 గరిష్ట ఎక్స్‌ఛేంజ్ పొందాలంటే మాత్రం అంత విలువైన ఫోన్‌ను మీరు తప్పనిసరిగా ఎక్స్‌ఛేంజ్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఆ మేర షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ ఫోన్ మీద డిస్కౌంట్ పొందుతారు. దీంతో రూ.549 మాత్రమే చెల్లించి ఆ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
షియోమీ కంపెనీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఆఫర్‌ను ప్రకటించగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఆఫర్‌ను వినియోగదారులు పొంది ఆ మేర డిస్కౌంట్‌తో ఫోన్‌ను కేవలం రూ.549 మాత్రమే చెల్లించి సొంతం చేసుకోవచ్చు. కాగా రెడ్‌మీ నోట్ 5 ప్రొ ఫోన్‌లో 5.99 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.