మనల్ని మనం తెలుసుకుందాం

-

 

 

ఒకరు పొగుడుతుంటారు..మరొకరు తిడుతుంటారు.. ఇంకొకరు జన్మజన్మల శత్రుత్వమేదో మిగిలి ఉన్నట్లు అకారణంగా ద్వేషిస్తుంటారు. ప్రతీ స్పందననీ మనసుకి తీసుకుంటే తుఫానులో చిక్కుకున్న సంద్రంలా ఊగిసలాడడం తప్ప ప్రశాంతత ఎక్కడుంటుంది?

మనమెవరికో ఏ కోణంలోనో నచ్చుతాం. అలాగే ఎవరికో ఎందుకో అస్సలు నచ్చము. ఈ రెండు తూకాలనూ సమానంగా భరించాల్సింది పోయి మరోవైపు మనమేమో అందరికీ నచ్చేలా ఉండాలని విశ్వప్రయత్నం చేయడం మొదలుపెడతాం.

క్షణకాలంలో ఒక మనిషి మనల్ని అభిమానిస్తున్నారూ, ద్వేషిస్తున్నారూ అంటే ఆ క్షణం వారున్న పరిస్థితులు, ఆ క్షణపు వారి మానసిక స్థితి, మన ప్రవర్తనలో వ్యక్తమయ్యే లక్షణాలూ. ఇలా ఎన్నో అంశాల ఆధారంగా ఓ అభిప్రాయం నిర్మితమవుతుంది.

 

ఇలా ఎన్నో అంశాలతో కూడిన ఇంత క్లిష్టమైన ప్రక్రియను మనకు అనుకూలంగా మరల్చుకోవాలని తాపత్రయపడుతున్నామూ అంటే మనలోనే పెద్ద లోపం ఉన్నట్లు ! మనదైన శైలిలో మనం బ్రతకడం తప్ప ఈ ప్రపంచంలో ఎవరినో సంతృప్తి పరుద్దామని, అందరి అభిమానాన్ని పొందుదామని ప్రయాసపడితే అది వ్యర్ధప్రయత్నమే అవుతుంది.

 

క్షణంక్రితం వరకూ అభిమానిస్తున్న ఆత్మీయులు సైతం మరుక్షణంలో ఎడమొహమై పోతారు. కారణం చిన్నదే. వాళ్లు మనల్ని ఫలానా విధంగా ఉండాలని కోరుకుంటున్నారు. మనమేమో ఏదో సందర్భంలో మరోలా ప్రవర్తిస్తాం. చిన్న మానసిక సర్దుబాటు సరిపోతుంది…ఏకమవ్వడానికి !

Read more RELATED
Recommended to you

Latest news