నేను సినిమాల్లో విజయవంతమైన హీరో కావడానికి నాభార్య సురేఖనే కారణం అన్నారు మెగాస్టార్ చిరంజీవి. మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆయన తన భార్య సురేఖతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళల శ్రమ గుర్తించడానికి ఇదే సరైన రోజు అనుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. మీ అందరిని చూస్తుంటే నాకు మా అమ్మగారే గుర్తుకు వస్తున్నారని అన్నారు. చిన్నప్పటి నుంచి మా అమ్మ పడే కష్టం ఏమిటో నాకు తెలుసు అని అన్నారు. నేను వందశాతం నా సినిమాలపై దృషి పెట్టడానికి సురేఖ కారణమని అన్నారు. మా ఇంట్లో ఎలాంటి లోటు లేకుండా సురేఖ చూసుకున్నారని అన్నారు. ఈరోజు మహిళలు ఎంతో స్థాయికి .. గగనానికి ఎదుగుతున్నారని ఆయన అన్నారు. మిలిటరీ, ఎయిర్ ఫోర్స్ వరకు మహిళలు వెళ్తున్నారని అన్నారు. ఇంట్లో ఉన్న మన తల్లులను, చెల్లెళ్లను ప్రోత్సహించాలని చిరంజీవి సూచించారు. ప్రపంచ గర్వంచే స్థాయిలో స్త్రీ శక్తి ఉండాలని ఆయన కోరుకున్నారు.
నేను సక్సెస్ ఫుల్ హీరో కావడానికి ఆమెనే కారణం: మెగాస్టార్ చిరంజీవి
-