తొలి క‌ల‌యిక‌ శృంగారంలో ఇలా చేస్తే నొప్పే తెలియదట..!!

స్త్రీ పురుషుల క‌ల‌యికలో శృంగారం అనేది ప్ర‌ముఖ పాత్ర పోషిస్తుంది. శృంగారం ఓ అంద‌మైన అనుభూతి. ఒక‌రినొక‌రు అర్థం చేసుకొని ఇద్ద‌రి అంగీకారంమేర‌కు చేసే శృంగారం నొప్పిని తెలియ‌నివ్వదు. . తొలి క‌ల‌యిక‌లో చేసే త‌ప్పులు శృంగారం అంటేనే భ‌యం క‌లిగిస్తుంది.  శృంగారాన్ని కొందరు తప్పుగా భావిస్తారు..మరి కొంతమంది మాత్రం ఇష్టపడతారు. దీన్ని మంచిగా భావించాలి కానీ బూతుగా మాత్రం భావించకూడదు..

ఇది అందరికీ కూడా అవసరం అయ్యేది కనుక పలు విషయాల పైన ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా వుంది. పైగా తెలుసుకోవడం కూడా తప్పేమి కాదు. మాట్లాడుకోవచ్చు. అలానే ఎప్పుడు కూడా కలయికలో పాల్గొంటున్నారు అంటే మీ పార్ట్నర్ అంగీకారం కూడా అవసరం అని గుర్తుంచుకోండి. చాలా మంది పార్ట్నర్‌కి ఇష్టమా, అనేది ఏ మాత్రం పట్టించుకోరు. ఇద్దరికీ నచ్చితేనే కార్యంలో పాల్గొనాలి. లేదంటే మీరు సెక్సువల్ సాటిస్ఫాక్షన్ మిస్ అవుతారు గుర్తుంచుకోండి.

అదే విధంగా కలయిక అనేది ఎంతో రసవత్తరంగా ఉంటుంది. అందులోనూ మొదటి సారి అంటే మిక్సెడ్ ఫీలింగ్స్ ఉంటాయి. ఎక్సయిట్మెంట్ ఉంటుంది. అలానే కాస్త టెన్షన్‌, సిగ్గు కూడా ఉంటుంది..మొదటి సారి మీరు కలయిక లో పాల్గొన్నన్నట్లయితే కంఫర్టబుల్ గా ఉండాలి అని గుర్తు పెట్టుకోండి. అయితే మీ కంఫర్ట్ ఎంత ముఖ్యమో.. మీ భాగస్వామి యొక్క కంఫర్ట్ కూడా అంతే ముఖ్యమని తెలుసుకోండి. అదే విధంగా సమయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏ మాత్రము టెన్షన్ పడకండి. టెన్షన్ పడడం వల్ల నష్టమే కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. కనుక ఎలా అయితే ఆనందం కలుగుతుందో ఆ విధంగా మీరు చూసుకుని నెమ్మదిగా మీ యొక్క పని మొదలు పెట్టండి. అంతే కానీ హడావిడి పడ్డారంటే ఫీలింగ్స్ కాస్త పులుసు కారిపోతాయి.

మొదటి సారి కనుక శృంగారం చేస్తున్నట్టు అయితే ఫోర్ ప్లేతో మొదలు పెట్టండి. అప్పుడు మీ శృంగారం బాగుంటుంది. సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. అలానే లేని పోనీ ఆలోచనలను మెదడులోకి తీసుకు రావద్దు. అనవసరంగా ఆలోచిస్తే యాంగ్జైటీ పెరిగి మీ ప్లాన్‌ని మొత్తం నాశనం చేసేస్తుంది. అలానే సేఫ్ రొమాన్స్ ముఖ్యం అని గుర్తు పెట్టుకోండి. ప్రొటెక్షన్ వంటివి వాడడం కూడా మంచి పద్దతి..మీ భాగస్వామి కూడా మీతో పాటు ఎంజాయ్ చేసేలా మీరే చేసుకోవాలి అప్పుడే రొమాన్స్ను బాగా ఎంజాయ్ చేస్తారు..