మీ భాగస్వామికి అన్నీ చెప్పొద్దు..వాటిని దాచిపెట్టండి..ఎందుకంటే?

-

దాంపత్య జీవితం అనేది ఎంతో మధురమైనది..దానిని అనుభవించాలి..అప్పుడే పూర్తి విషయం తెలుస్తుంది.రోజుకో విధమైన ఫీలింగ్ తో ఉంటే జీవితంలో ముందుకు వెలతారు.పూర్తిగా కొత్త వ్యక్తిని జీవితభాగస్వామిని చేసుకుని వారితో కడదాకా ప్రయాణించడం మాటల్లో చెప్పుకున్నంత సులువుగా ఏమీ ఉండదు. అర్థం చేసుకుంటూ, అడ్జస్ట్ అవుతూ ముందుకు సాగుతుంటే దాంపత్య బంధంలోని మాధుర్యం ఏమిటో అర్థం అవుతుంది. ఇష్టం, ప్రేమ, బాధ, కోపం ఇలా ప్రతి భావోద్వేగం బంధంలో ఉంటుంది..

ఆ భావోద్వేగాలను నియంత్రించుకునే తత్వం, ఎదుర్కొనే శక్తిపైనే దాని దాంపత్యబంధంలోని మాధుర్యం ఆధారపడి ఉంటుంది. ఏ రెండు జంటలూ ఒకేలా ఉండవు. ఒక జంట ఆనందంగా ఉన్నా, లేదా నిత్యం గొడవలు, ఘర్షణలతో బాధగా ఉన్నా ఆ జంటలో పోలిక ఉండకూడదని చెబుతారు..ఇక పోతే మీ భాగస్వామికి కొన్ని విషయాలు చెప్ప కూడదట..వాటి వల్ల విడిపోయే ప్రమాదం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు..అవేంటంటే..

మీకు మీ భాగస్వామిని ఎంతగా ప్రేమించినా, వారి కుటుంబం పట్ల మీకు అదే భావాలు ఉండాల్సిన అవసరం లేదు. అయితే వారి కుటుంబం అంటే మీకు ఇష్టం లేదన్న విషయాన్ని మీ భాగస్వామితో పంచుకోవద్దని అంటున్నారు రిలేషన్ షిప్ ఎక్స్ పర్ట్స్. దీని వల్ల లేనిపోని వాదనలు, వాటి నుండి గొడవ, ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. మీకు వారంటే ఇష్టం లేదన్న విషయాన్ని దాచడం వల్ల జరిగే నష్టం లేదని వివరిస్తున్నారు..అసలు వాళ్ల గురించి పెద్దగా మాట్లాడక పోవడమే బెస్ట్..
మీ ఎక్స్ గురించి అస్సలు తెలపకపోవటం మేలు..అది తెలిస్తే మాత్రం గొడవలు జరగడం పక్కా..అందుకే ఆ టాపిక్ తీసుకురాక పోవడం మంచిది.

మిమ్మల్ని ఎవరైనా ఫ్లర్టింగ్ చేస్తుంటే ఆ విషయం మీ భార్యకో, భర్తకో తెలిస్తే వారిలో అభద్రతాభావం కలిగే అవకాశం ఉంటుంది. అది ఇతర పరిణామాలకు దారి తీసే ప్రమాదం లేకపోలేదు. ఇది బంధంలో ఏమాత్రం మంచిది కాదని గుర్తుంచుకోండి..ఇలాంటి తెలిస్తే మాత్రం అవతలి వారి గుండె పలిగి పోతుంది..మీరు మోసం చేశారని భావించి దూరం అవుతారు.

ఇక పోతే మీ సంపాదన..ఆర్థిక విషయాలను ఒకరితో ఒకరు పంచుకోవడం చాలా ముఖ్యమని భావిస్తారు. ఇద్దరూ కలిసి వారి ఫైనాన్షియల్ ప్లానింగ్స్ వేసుకుంటారు. కొంతమంది మాత్రం వారు ఎంత సంపాదిస్తారు, పెట్టుబడి పెట్టడం లాంటి విషయాలను భాగస్వాములతో పంచుకోరు. ఎంత డబ్బు సంపాదిస్తారనే విషయాన్ని పంచుకోవడమనేది మీ ఇష్టం..ఇవి పొరపాటున బయట పడితే మాత్రం మీ జీవితం పోయినట్లే..

Read more RELATED
Recommended to you

Latest news