ఎదుట వాళ్ళు చెప్పకుండా.. మిమ్మల్ని ఇష్టపడుతున్నారని.. చెప్పే సంకేతాలు ఇవే..!

-

మన చుట్టూ ఉండే వాళ్ళు మనల్ని ప్రేమించొచ్చు. నిజానికి మనం మనసులో వాళ్ళ మీద ఎంతో ప్రేమ పెట్టుకుంటూ ఉంటాము. వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారా లేదా అనేది మనకి తెలియకపోవచ్చు. ఒక్కొక్క సారి వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారేమో అని సందేహం మనలో కలుగుతూ ఉంటుంది. కానీ అడిగితే ఏమనుకుంటారా అని అడగడం మానేస్తారు. చాలామంది ఒకవేళ కనుక నిజంగా ఒకరి మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లయితే వాళ్ళు చెప్పకపోయినా వీటి ద్వారా మీరు వాళ్లు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అని తెలుసుకోవచ్చు. అది ఎలా అని ఆశ్చర్యపోతున్నారా… అయితే కచ్చితంగా మీరు ఈ విషయాలని తెలుసుకోవాలి.

ఎవరైనా ఇష్టపడేటప్పుడు కచ్చితంగా ఈ సంకేతాలు కనబడతాయి. ఈ సంకేతాల ద్వారా ఆ మనిషి మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అని మీరు తెలుసుకోవచ్చు. మీకు ఇష్టమైన వారు మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లయితే మీ బిహేవియర్ వారికి బాగా నచ్చుతుందని చెప్పొచ్చు. వారు మీ నుంచి స్నేహాన్ని కోరుతున్నట్లు అర్థం. ఎదుటవారు మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లయితే తరచూ మీ కళ్ళల్లోకి చూస్తారు. మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తి మీ రూపాన్ని ఎప్పుడూ కూడా పొగుడుతూ ఉంటారు. ఏదైనా కొత్త మార్పులు చిన్న చిన్నవైనా సరే గుర్తుపట్టేస్తారు. మిమ్మల్ని మరొకరి ఎవరైనా ఇష్టపడుతున్నట్లయితే వాళ్లు అసూయ పడుతూ ఉంటారు.

ఇంకో వ్యక్తితో చనువుగా ఉంటే వాళ్ళు సహించలేరు మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తి మీరు చెప్పే అన్ని విషయాలని కూడా శ్రద్ధగా వింటారు. మీరు వినమని చెప్పక్కర్లేదు అలానే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఎప్పుడూ మిమ్మల్ని నవ్వించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. సరదాగా ముట్టుకోవడం నవ్వడం కన్ను కొట్టడం వెక్కిరిస్తూ ఆటపట్టించడం వంటివి చేస్తూ ఉంటారు. అలానే బాడీ లాంగ్వేజ్ లో కూడా మార్పు కనపడుతుంది.

మీ బాడీ లాంగ్వేజ్ ని వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. మీ రక్షణ పట్ల వల్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉంటారు మిమ్మల్ని సురక్షితంగా చూసుకోవడాన్ని వాళ్ళ యొక్క బాధ్యతగా భావిస్తారు అయితే ఇది అందరిలో కూడా జరగకపోవచ్చు. కొంతమంది అందరితో బాగా చనువుగా ఉంటారు. అలాంటప్పుడు ఇలాంటివి వర్తించవు. కొంతమంది మాత్రం స్లో గా ఉంటారు. కేవలం కొందరిలో మాత్రమే కొందరితో మాత్రమే దగ్గరవుతూ ఉంటారు అలాంటప్పుడు కచ్చితంగా మీరు వీటిని సంకేతాలుగా భావించొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news