అదరహో : క్యాచీ టైటిల్ తో రానున్న నిఖిల్ సిద్దార్ధ్…

-

ఈ మధ్యనే యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ్ కార్తికేయ 2 తో మరో సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఈ విజయాన్ని అనుభవిస్తూనే మరో రెండు సినిమాలు లైన్ లో పెట్టాడు సిద్దార్ధ్. ఇప్పటికే స్పై లాంటి పాన్ ఇండియా సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉన్నాడు. కాగా నిన్ననే నిఖిల్ కొత్త సినిమా సమాచారాన్ని తెలిపిన చిత్ర బృందం ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ను ప్రకటించడంతో ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు. ఈ రోజు తన కొత్త సినిమా టైటిల్ ను స్వయంభు అన్న పేరుతో ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమాను భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేయనున్నారు. స్పై సినిమాలాగానే దీనిని కూడా తెలుగు, హిందీ , తమిళ్, మలయాళ మరియు కన్నడ భాషలలో తెరకెక్కిస్తున్నారు.

మరి టైటిల్ మాత్రం చాల క్యాచీగా ఉంది.. సినిమా ఏవిధంగా ఉంటుంది అంది తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news