ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీల మద్దతు కోసం కొన్ని రోజులుగా తిరుగుతున్నారు. తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్ తో కేజ్రీవాల్ భేటీ అయ్యారు. ఈ భేటీలో అధికారుల బదిల విషయంలో బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఆర్డినెన్సు ను కేజ్రీవాల్ వ్యతిరేకిస్తున్నారు. పైగా సుప్రీమ్ కోర్ట్ కూడా కేజ్రీవాల్ కు అనుకూలంగానే తీపును ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ ఆర్డినెన్సు కు వ్యతిరేకంగా సీఎం ల మద్దతును కూడగట్టుకోవడానికి కేజ్రీవాల్ తిరుగుతున్నారు. ఇక ఇప్పుడు స్టాలిన్ ను ఈ విషయంలో మద్దతు ఇవ్వాలని కోరారు. కాగా ఈ విషయంలో స్టాలిన్ కూడా బీజేపీకి వ్యతిరేకంగా మరియు కేజ్రీవాల్ కు మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు.
పాలనలో ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు సమర్ధవంతమగా సాగిస్తున్నారు. మరి ముందు ముందు ఈ కొత్త ఆర్డినెన్సు విషయంలో ఏమి జరగనుంది అన్నది తెలియాల్సి ఉంది.