గుడ్ న్యూస్.. నిట్‌ వరంగల్‌లో 129 జాబ్స్‌..!

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌) వివిధ విభాగాల్లో పలు ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చెయ్యచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే.. వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌) వివిధ విభాగాల్లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

నోటిఫికేషన్‌ ద్వారా 129 పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టులను బట్టి వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో చూడొచ్చు. రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇది ఇలా ఉంటే సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ రిజిస్టిర్‌ పోస్టులకు రూ.1000, ఇతర పోస్టులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

ఎలా సెలెక్ట్ చేస్తారు అనేది చూస్తే.. రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://nitw.ac.in/ వెబ్‌సైట్‌ లో చూడొచ్చు. దరఖాస్తులు ప్రారంభం ఆగస్టు 23, 2021. చివరితేదీ సెప్టెంబర్‌ 23, 2021.

పోస్టుల వివరాలు:

సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌- 1
అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌- 6
అసిస్టెంట్‌ ఇంజినీర్‌- 2
సూపరింటెండెంట్‌- 8
టెక్నికల్‌ అసిస్టెంట్‌- 27
జూనియర్‌ ఇంజినీర్‌- 8
లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌- 2
ఎస్‌ఏఎస్‌ అసిస్టెంట్‌- 3
సీనియర్‌ టెక్నీషియన్‌- 19
టెక్నీషియన్‌- 34
జూనియర్‌ అసిస్టెంట్‌- 19.