ఐపీఎల్-2022లో నేడు మరో ఉత్కంఠ భరిత పోరుకు రంగం సిద్దమైంది. ఎంసీఏ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు తమ చివరి మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి మంచి ఊపు మీద ఉన్నాయి. సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించగా.. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ రెండోసారి గెలిచింది.
బలాబలాల్లో ఇరుజట్లు సమానంగా ఉండడంతో ఆసక్తికర పోరు జరగడం ఖాయం. పంజాబ్ కింగ్స్‌కు ధావన్ ఫాం పెద్ద బలం కాగా.. అటు లక్నో సూపర్ జెయింట్స్‌కు కేఎల్ రాహుల్ సగం బలం అని చెప్పొచ్చు. బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఆరు పరుగులు చేసిన కేఎల్ రాహుల్ రబాడ బౌలింగ్‌లో జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం లక్నో వికెట్ నష్టానికి 13 పరుగులు చేసింది.