నా కులం మీద దాడి జరిగింది… మల్లికార్జున ఖర్గే

-

పొలిటికల్ లీడర్స్ రెచ్చగొట్టే మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని మల్లికార్జున్ ఖర్గే సూచించారు. పార్లమెంట్ వెలుపల తృనాముల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ చేసిన మిమిక్రీ పై రాజ్యసభలో జగ్దీప్ దన్కడ్ కులం ప్రస్తావన తీసుకురావడం గురించి ఆయన తప్పుబట్టారు.తనపై వ్యక్తిగత దాడి జరిగిందని, ఒక రైతు కులాన్ని అవమాన పరిచారని జగ్దీప్ ధన్‌ఖడ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, కుల ప్రస్తావన గూర్చి ఇక్కడ ఎందుకని ఖర్గే ప్రశ్నించారు. ”ఎవరూ ఇలా మాట్లాడకూడదు. రెచ్చగొట్టే మాటలకు దూరంగా ఉండాలి” అని ఖర్గే ఆయన అన్నాడు.

నాకు ఎన్నడు సభలో మాట్లాడే అవకాశం రాకపోగా నా కులం పై దాడి జరిగిందని అయినను కూడా నేను ఎప్పుడూ అలా మాట్లాడలేదని మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నాడు. 140 మంది ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెన్షన్ చేయటం పై ప్రతిపక్షాలు మాక్ పార్లమెంట్ నిర్వహించడం ,కళ్యాణ్ బెనర్జీ మిమిక్రీ చేయడం వంటి వివాదాలను రాహుల్ గాంధీ వీడియోలు చిత్రీకరించడం వివాదస్పదమైంది.

Read more RELATED
Recommended to you

Latest news