ఆ రైతు కుటుంబానికి 10 లక్షలు : సీఎం కేసీఆర్‌

-

నేడు సీఎం కేసీఆర్‌ వికారాబాద్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వికారాబాద్‌ కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అయితే.. రైతుల పట్ల తన అభిమానాన్ని, ప్రేమని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరోసారి చాటుకున్నారు. మరణించిన రైతు కుటుంబానికి అండగా నిలిచారు. నేనున్నానంటూ సాయం అందించారు. వివిధ రాష్ట్రాల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శంచడానికి ఇటీవల వచ్చిన జాతీయ రైతు సంఘం కార్యకర్త విమల్ కుమార్.. ఈ పర్యటన అనంతరం హైదరాబాద్‌లో గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్.. విమల్ మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

KCR to address meeting in Vikarabad on August 14

అలాగే ఆయన కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. జాతీయ రైతు సమాఖ్య కర్ణాటక రాష్ట్ర అధ్యక్షులు శాంత కుమార్ అధ్యక్షతన మైసూరులో ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ రైతు బంధు సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా ఆ కుటుంబానికి సాయం అందేలా చూశారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలోని రైతాంగానికి ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధు, రైతు భీమా, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలు రైతులకు ఉపయోగపడుతున్నాయని, వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తున్నాయని చెప్పారు. తెలంగాణ పథకాల గురించి తెలుసుకున్న కర్ణాటక రైతాంగం.. తమ రాష్ట్రంలో కూడా ఇటువంటి పథకాలు అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news