జూమ్లా వర్సెస్ రియాలిటీ అంటూ కాంగ్రెస్‌ విమర్శలు

-

నిన్న స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఎర్రకోటపై ప్రధాని మోడీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రధాని మోడీ జాతినుద్దేశించి మాట్లాడుతూ.. కుటుంబ పాలన, అవినీతి పాలనపై విమర్శలు గుప్పించారు. అయితే.. మోదీ ఎర్రకోట పైనుంచి వెలువరించిన ప్రసంగం పట్ల కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు సంధించింది. “జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్” అంటూ మోదీ చేసిన నినాదం ఓ గిమ్మిక్కు అని అభివర్ణించింది కాంగ్రెస్‌. ఈ మేరకు అబద్ధం వర్సెస్ నిజం (జూమ్లా వర్సెస్ రియాలిటీ) పేరిట కాంగ్రెస్ పార్టీ ఓ వీడియో క్లిప్పింగ్ విడుదల చేసింది.

Karnataka BJP, Congress lock horns on dynasty politics | Deccan Herald

మోదీ నినదించిన నాలుగు రంగాల్లోనూ కేంద్ర ప్రభుత్వ పనితీరు అధ్వానంగా ఉందని కాంగ్రెస్‌ విమర్శించింది. ‘జై జవాన్’ అంటున్న కేంద్రం అగ్నివీరులకు నాలుగేళ్ల తర్వాత ఉద్యోగ భరోసా ఇవ్వలేకపోతోందని పేర్కొంది. ‘జై కిసాన్’ విషయానికొస్తే, రైతులకు కనీస మద్దతు ధర అందించలేకపోతుందని, ‘జై విజ్ఞాన్’ అంటున్న కేంద్రం సైన్స్ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం తప్ప ఏంచేసిందని కాంగ్రెస్ పార్టీ నిలదీసింది. ‘జై అనుసంధాన్’ అనడం కూడా కేవలం మాట వరుసకేనని పేర్కొంది కాంగ్రెస్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news