ఒప్పో నుంచి బడ్జెట్ ఫోన్ల పరంపర కొనసాగుతోంది.. ఇటీవలే ఇండియాలో ఒప్పో A17 అనే బడ్జెట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇప్పుడు ఇదే సరీస్‌లో
ఒప్పో A17 K పేరుతో ఇంకో ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి..
ఒప్పో కంపెనీ ఇండియన్ మార్కెట్లో విక్రయాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. మిడ్ రేంజ్‌లో కొత్త ఫోన్లను లాంచ్ చేయడంతోపాటు, వరుసగా కొత్త బడ్జెట్ ఫోన్లనురిలీజ్ చేస్తోంది. ఈ కంపెనీ ఇటీవలే ఇండియన్ మార్కెట్‌లోకి A17 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ సిరీస్‌లోనే ఒప్పో A17k పేరుతో మరో డివైజ్‌ను లాంచ్ చేసింది. ఇందులో తక్కువ ధరకే బెస్ట్ ఫీచర్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్6.56-అంగుళాల IPS LCD డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్, 5,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో లభిస్తుంది. కొత్తగా లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్ స్సెసిఫికేషన్లు, ధర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
OPPO A17k స్పెసిఫికేషన్లు….
ఒప్పో A17k స్మార్ట్‌ఫోన్ HD+ రిజల్యూషన్‌తో 6.56-అంగుళాల IPS LCD డిస్‌ప్లేతో వస్తుంది.
ఇది స్టాండర్డ్ 60Hz రిఫ్రెష్ రేట్‌కి సపోర్ట్ చేస్తుంది. 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది.
ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 12 బేస్డ్ కలర్ ఓఎస్‌తో రన్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్‌లో వెనుకవైపు 8MP సింగిల్ కెమెరా ఉంది.
ఫ్రంట్ కెమెరాలో 5MP సెన్సార్ ఉంది. IPX4 బేసిక్ స్ప్లాష్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో వస్తుంది.
ఈ డివైజ్ 5,000mAh బ్యాటరీతో మంచి పవర్ బ్యాకప్‌ను అందిస్తుంది.
OPPO A17k ధర..
ఒప్పో A17k స్మార్ట్‌ఫోన్ 4GB+ 64GB వేరియంట్ ధర రూ.10,499గా ఉంది.
ఈ ఫోన్ గోల్డ్, నేవీ బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ను ఒప్పో అధికారిక వెబ్‌సైట్, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్‌లైన్ స్టోర్ల నుంచి కొనుగోలు చేయవచ్చు.
A17 తో పోలిస్తే స్పెసిఫికేషన్లు తక్కువే..
ఇప్పటికే మార్కెట్లో ఉన్న A17 స్మార్ట్‌ఫోన్‌తో పోలిస్తే ఇందులో RAM సైజ్ తక్కువగా ఉంది.
ప్రైమరీ రియర్ కెమెరా రిజల్యూషన్ కూడా తక్కువగా ఉంది, డెప్త్ సెన్సార్ లేదు.
ఒప్పో A17k మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఇది 3GB RAMతో పాటు 4GB వర్చువల్ RAM టెక్నాలజీని అందిస్తోంది. 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజీని 1TB స్టోరేజ్ వరకు ఎక్స్‌ప్యాండ్ చేసుకొనే అవకాశం ఉంది. ఇది ఇప్పటికే మార్కెట్లో ఉన్న రియల్‌మీ C35, రెడ్‌మీ A1+, మోటో E32 వంటి మోడల్స్‌కు పోటీ ఇవ్వనుంది.