బాలయ్య సినిమా కోసం ఆ హీరోయిన్ ని కట్ చేసిన బోయపాటి…. ??

-

ప్రస్తుతం బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టర్ ఎంతో పవర్ఫుల్ గా ఉండనున్నట్లు టాక్. ఇక గతంలో బాలయ్య, బోయపాటి ల కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు ఒక దానిని మించి మరొకటి ఎంతటి ఘన విజయాలు సాధించాయో మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా, వాటిని మించేలా ఉంటుందని అంటోంది సినిమా యూనిట్.

ఇక ఈ సినిమా కోసం తన శరీర బరువును కొంత తగ్గించిన బాలయ్య, తన గెటప్, హెయిర్ స్టయిల్ విషయమై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్తున్నారు. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నట్లు ఇటీవల వార్తలు ప్రచారం అవ్వగా, నేడు అందుతున్న మరొక వార్తను బట్టి, వారిలో ఒక హీరోయిన్ మాత్రమే సినిమాలో ఉంటుందని, మరొక హీరోయిన్ పాత్రను స్క్రిప్ట్ లో కొంత మార్పులు చేర్పులు చేసిన పిదప దర్శకుడు బోయపాటి తొలగించారని అంటున్నారు. ముఖ్యంగా సినిమాలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోనున్నాయని, అలానే బాలయ్య చెప్పే డైలాగ్స్ కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు.

 

అయితే కథ రీత్యా బాలయ్యకు ఒక్క హీరోయిన్ మాత్రమే ఉంటుందని, అతి త్వరలో ఆమె ఎవరు అనేది తెలియపరుస్తారని సమాచారం. ఇక సినిమా ఖర్చు కూడా దాదాపుగా రూ. 70 కోట్లు ఉంటుందని, ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా స్క్రిప్ట్ కి తగ్గట్లు సన్నివేశాలను బట్టి ఖర్చుని జాగ్రత్తగా ప్లాన్ చేస్తోందట సినిమా యూనిట్. మొత్తానికి ఈ సినిమా కోసం అటు బాలయ్య, ఇటు బోయపాటి పక్కాగా ప్లానింగ్ చేస్తుండడంతో, తప్పకుండా వీరిద్దరి కాంబోలో రాబోయే ఈ సినిమా హిట్ కొట్టే ఛాన్స్ కనపడుతోందని అంటున్నారు విశ్లేషకులు…..!!

Read more RELATED
Recommended to you

Latest news