ఉద్యోగం పోయినా ప్రతీ నెలా జీతం రావాలంటే.. ఇలా చేయండి..!

-

చాలామంది ఉద్యోగాలు పోతున్నాయని చెప్పడం మనం వింటున్నాము దిగ్గజ కంపెనీల మొదలు చిన్న చిన్న కంపెనీల్లో పనిచేసే ఉద్యోగాల వరకు చాలామంది ఉద్యోగులని తొలగిస్తున్నారు వందల నుండి వేల సంఖ్యలో ఒకే సారి ఉద్యోగులని తొలగించడానికి కూడా మనం చూస్తున్నాం. దీంతో ఉద్యోగులందరికీ కూడా జాబ్ పోతుందేమో అన్న టెన్షన్ పట్టుకుంటుంది. ఉద్యోగము ఎప్పుడు పోతుందా అని చాలామంది భయపడుతున్నారు నిజానికి ఒక్కసారి ఉద్యోగం పోయిందంటే కష్టాలు తప్పవు. ఎంత మనం సేవ్ చేసుకున్నా కూడా ఇబ్బంది తప్పదు డబ్బులు సేవ్ చేసుకున్న కొంత వరకు బాగానే ఉంటుంది ఆ తర్వాత మళ్లీ ఇబ్బంది కచ్చితంగా ఉంటుంది.

అయితే జాబ్ పోతుందేమో డబ్బులు రావేమో అన్న భయం లేదు. జాబ్ లాస్ ఇన్సూరెన్స్ కవర్ మిమ్మల్ని ఆదుకుంటుంది దీని గురించి చాలా మందికి అవగాహన లేదు. కారణం ఏంటంటే ఇన్సూరెన్స్ పాలసీలు ఎక్కువగా లేకపోవడమే కొన్ని ప్రైవేట్ బీమా కంపెనీలు మాత్రమే ఈ ఇన్సూరెన్స్ కవర్ ని యాడ్ ఆన్ పాలసీ లాగ వీటిని ఇస్తూ ఉంటాయి. కొంత ప్రీమియం చెల్లిస్తే ఉద్యోగం కోల్పోయిన సందర్భంలో కొన్ని నెలల పాటు వారికి శాలరీ ఇలా ప్రతి నెల ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులని చెల్లిస్తుంది జాబ్ లాస్ ఇన్సూరెన్స్ కవర్ పేరుతో డైరెక్ట్ ఇన్సూరెన్స్ పాలసీలు అయితే లేవు.

క్రిటికల్ ఇల్ నెస్ కవర్ లేదా హోమ్ లోన్ ప్రొటెక్షన్ ప్లాన్ తో కలిపి యాడ్ ఆన్ లాగ ఈ పాలసీలని ఇస్తున్నాయి వీటిని తీసుకుంటే ఈ ఈఎంఐ భారం కొంతకాలం ఉండదు. దీని వలన ఉద్యోగం కోల్పోయిన సందర్భంలో లేదా అనారోగ్యానికి గురై ఆస్పత్రి బారిన పడినా బీమా కంపెనీ హోమ్ లోన్ ఈఎంఐలు చెల్లిస్తుంది. ప్రభుత్వం స్కీమ్ కూడా వుంది. ఆ పథకాల్లో రాజీవ్ గాంధీ శ్రామిక్ కళ్యాణ్ యోజన ఒకటి. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ESIC) ఈ పథకాన్ని రూపొందించింది.

Read more RELATED
Recommended to you

Latest news