ప్రధాని మోడీకి సీఎం జగన్ దత్తపుత్రుడు – రఘురామ

-

 

 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, హోం మంత్రి అమిత్ షా గారు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గార్ల మధ్య గ్యాప్ ఉన్నట్టు ఉందని ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గారు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని, ప్రధాని మోడీ.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని దత్తపుత్రుడు మాదిరిగా చూసుకుంటున్నారని ఆయన తెలిపారన్నారు ఎంపీ రఘురామ. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అడిగిన అప్పులు ఇవ్వని కేంద్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అడిగిన వెంటనే గత నెలలో పదివేల కోట్లు, ఈనెలలో 13 వేల కోట్ల అప్పు ఇచ్చారని అన్నారని తెలిపారు.

 

ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 29 సార్లు అపాయింట్మెంట్ అడిగితే, కేవలం 9 సార్లు మాత్రమే అపాయింట్మెంట్ ఇచ్చారని చెప్పారన్నారు. అదే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అపాయింట్మెంట్ అడిగినా ఇస్తున్నారని గుర్తు చేశారని, అవినీతి ప్రభుత్వం అని వ్యాఖ్యలు చేయడం కాదని ఆధారాలుంటే చూపాలని కొట్టు సత్యనారాయణ గారు కేంద్ర ప్రభుత్వాన్ని చేసిన డిమాండ్, ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు చేసిన ఒక అవినీతినైనా నిరూపించాలని లేకపోతే క్షమాపణలు చెప్పాలని కొట్టు సత్యనారాయణ గారు చేస్తున్న సవాల్ ను ప్రధాని మోడీ గారికి లేఖ ద్వారా వివరిస్తానని తెలిపారు.

జేపీ నడ్డా, అమిత్ షా గార్లు చేసిన ఆరోపణలకు సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారి నోరు పెగలడం లేదని, ముఖ్యమంత్రి గారు బెంబేలెత్తిపోతున్నారని అన్నారు. రెండు పడకల గది ఇల్లుకు 6643 రూపాయల కరెంటు బిల్లు రావడం పట్ల రఘురామకృష్ణ రాజు గారు విస్మయం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ కూడా 1500 రూపాయలు దాటని కరెంటు బిల్లు, ఇప్పుడు 6643 రూపాయలు వచ్చిందన్నారు. ప్రతినెల 4 వేల రూపాయలు అదనంగా కరెంటు బిల్లు వస్తే, ఏడాదికి 48 వేల రూపాయల భారం పడుతుందని, ముఖ్యమంత్రి గారు ఆ ఒడి, ఈ ఒడి, ఆ దీవెన ఈ దీవెన పేరిట ఇచ్చే డబ్బులు 48 వేల రూపాయల కంటే తక్కువేనని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news