ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్..కు చిరంజీవి హాజరై షాకింగ్ కామెంట్స్…చేశారు. సినిమాలో సరైన కంటెంట్ఉంటేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు.. దర్శకుడు సినిమా సరిగ్గా తీయకపోతే చాలా మంది జీవితాలు తలకిందులవుతాయన్నారు.. భారీ తారాగణం, హిట్ కాంబినేషన్స్, కాల్షీట్స్ దొరికాయని సినిమా తీయవద్దని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు చిరంజీవి.
ఇక ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై పవన్ కళ్యాణ్‌కు అడ్వాన్స్‌గా బర్త్ డే విషెస్ తెలిపిన మెగాస్టార్ చిరంజీవి.. సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఉండి కష్టపడితే పైకొస్తారన్నారు.
ఇండస్ట్రీని లైట్‌గా తీసుకుంటే ఎంత వేగంగా పైకొచ్చారో అంతే వేగంగా వెనక్కి పోతారని తెలిపారు చిరంజీవి. సినిమా పరిశ్రమ గొప్ప పరిశ్రమ… నేను ఈ సిని పరిశ్రమలోనే ఎక్కవగా వున్నాను కొంత గ్యాప్ ఇచ్చిన మళ్ళీ ఇక్కడ కే వచ్చానన్నారు. నేను ఈ పరిశ్రమలో నేను భాగం అయినందుకు గర్వంగా వుంటుంది…ఒక ఫైర్ తో టాలెంట్ వున్న వాళ్ళు ఎప్పుడు ఇక్కడ నిలదొక్కు కుంటారని వెల్లడించారు.