చైనా సంస్థ‌ల‌కు లోకేష్ బంప‌ర్ ఆఫ‌ర్

-

  1. ఏపీని చూడండి..పెట్టుబ‌డుల‌తో రండి
  2. రాయితీలిస్తాం..త్వ‌రిత‌గ‌తిన అనుమ‌తులిస్తాం
  3. <శిక్ష‌ణ పొందిన యువ‌త‌ను అందిస్తాం
  4. ప్ర‌ముఖ సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో ఐటీశాఖా మంత్రి చ‌ర్చ‌లు


ఇన్ఫ‌ర్మేష‌న్ అండ్ టెక్నాల‌జీకి, ఎల‌క్ర్టానిక్స్ త‌యారీలో ప్ర‌పంచంలోనే పేరుగాంచిన చైనాలోని షెన్ జెన్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఐటీశాఖా మంత్రి నారా లోకేష్ శ‌నివారం వివిధ సంస్థల ప్ర‌తినిధుల‌తో కీల‌క భేటీలు నిర్వ‌హించారు. ఏపీకి రావాల‌ని వారిని మంత్రి ఆహ్వానించ‌గా..వారు సానుకూలంగా స్పందించారు.
అక్టోబ‌ర్‌లో ఏపీకి రానున్న టోంగ్డా బృందం
మొబైల్ ఫోన్ల ప్లాస్టిక్ కేసింగ్ తయారీ లో ఉన్న టోంగ్డా కంపెనీ వైస్ ఛైర్మెన్ వాన్గ్ యాహువాతో మంత్రి లోకేష్ స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఇరువురూ కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌రిశ్ర‌మ స్థాపించాల‌ని అనుకుంటే.. 21 రోజుల్లో అన్ని అనుమతులు ఇస్తామ‌ని, కంపెనీ ఏర్పాటు కు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ ప్రభుత్వమే కల్పిస్తుంద‌ని భ‌రోసా ఇచ్చారు. దీనిపై టోంగ్డా వైస్‌చైర్మ‌న్ స్పందిస్తూ.. అక్టోబర్ 2 వ వారంలో ఆంధ్రప్రదేశ్ కి కంపెనీ బృందం వ‌స్తుంద‌ని, సుమారు 5 వేల మందికి పైగా నిపుణులు త‌మ‌కు కావాల్సి ఉంటుంద‌ని తెలిపారు. ఏపీలో మాన‌వ‌వ‌న‌రులు పుష్క‌లంగా ఉన్నాయ‌ని, యువ‌త‌కు నైపుణ్య శిక్ష‌ణ ఇచ్చి..వారు టోంగ్డా కంపెనీలో ఉద్యోగాలు చేసేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మంత్రి హామీ ఇచ్చారు. టోంగ్డా కంపెనీ విష‌యానికి వ‌స్తే..60 శాతం షామి ఫోన్లకు టోంగ్డా ప్లాస్టిక్ కేసులు వాడుతున్నారు. చైనాలో ఈ ప్లాస్టిక్ కేసులు ఉత్ప‌త్తి చేస్తున్న టోంగ్డా ప‌రిశ్ర‌మ‌ల‌లో 24 వేల మందికి పైగా ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు.

సివిటిఈ కార్య‌క‌లాపాలు విస్త‌రించే ఆలోచ‌న‌
కాంపోనెంట్స్ బిజినెస్, ఫ్యూచర్ ఎడ్యుకేషన్, కార్పొరేట్ ఎడ్యుకేషన్, ఇంటెలిజెన్స్ హార్డ్ వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హెల్త్ కేర్ లో ఐటీ సర్వీసెస్ అందిస్తున్న సివిటిఈ కంపెనీ డైరెక్టర్ హువాంగ్ జేన్గ్కాంగ్ (cvte director Huang zhengkong )తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రంగం అభివృద్ధికి ప్ర‌వేశ‌పెట్టిన డిటిపి పాలసీ గురించి వివ‌రించారు. సంస్థ‌ల కార్య‌క‌లాపాలు ప్రారంభించేందుకు అవ‌సర‌మైన‌ భూములు కేటాయిస్తున్నామ‌ని చెప్పారు. ఏపీకి ఇప్ప‌టికే ఫ్రాంక్లిన్, కాన్డ్యూయెంట్, హెచ్ సిఎల్ , జోహో లాంటి పెద్ద కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయ‌ని, భార‌త‌దేశంలో ఇతర నగరాలతో పోల్చుకుంటే తక్కువ ఖర్చుతో ఆంధ్రప్రదేశ్ లో కంపెనీ కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉంద‌ని నారా లోకేష్ సివిటిఈ కంపెనీ డైరెక్ట‌ర్‌కు వివ‌రించారు. త్వ‌ర‌లో మా కంపెనీ ఉన్న‌త బృందం ఆంధ్రప్రదేశ్ కి వ‌స్తుంద‌ని, ఆ త‌రువాతే పెట్టుబ‌డుల‌పై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని సివిటిఈ కంపెనీ డైరెక్టర్ మంత్రికి హామీ ఇచ్చారు.

రియ‌ల్‌టైమ్ గ‌వ‌ర్నెన్స్‌కు హువావే స‌హ‌కారం
షెన్ జెన్‌లోని హువావే కంపెనీ కేంద్ర కార్యాల‌యాన్ని ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్, ఐటీ అధికారులు సంద‌ర్శించారు. 170 దేశాల్లో వ్యాపారం, ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న 500 కంపెనీల్లో 72వ‌ స్థానం, అన్ని దేశాల‌లో క‌లిపి 1 లక్షా 80 వేల మంది ఉద్యోగులు, 36 జాయింట్ ఇన్నోవేషన్ సెంటర్లు,14 రీసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ సెంటర్లు క‌లిగి ఉన్న హువావే ఐటీ, ఎల‌క్ర్టానిక్స్ రంగాల అభివృద్ధిలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. క్లౌడ్ డేటా సెంటర్లు, ఎంటర్ప్రైజ్ కొలాబ్రేషన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఎంటర్ప్రైజ్ వైర్లెస్ సర్వీసెస్ సేవ‌ల‌ను హువావే అందిస్తోంది. వీటితోపాటు సిసి కెమెరాలు, మొబైల్స్,రౌటర్లు, సర్వర్లు తయారుచేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news