బాలయ్య బాబు యంగ్ హీరోస్ కంటే స్పీడ్ గా..!!

-

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య బాబు నటించిన తాజా చిత్రం వీర సింహారెడ్డి. ఈ సినిమా తాజాగా జనవరి 12న విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల అయి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఎక్కడా చూసినా బాలయ్య సినిమా గురించే చర్చ నడుస్తోంది. మొదటి రోజు వసూళ్ళు కూడా అనుకున్నట్టే అదరగొట్టాయి.

బాలయ్య బాబు  108వ చిత్రంగా తెరకెక్కుతున్న అనిల్ రావిపూడి  డైరెక్షన్ లో జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటుంది.బాలయ్య చాలా ఎనర్జిటిక్, ఎంతో మంది హీరోలు సినిమా తర్వాత రిలాక్స్ కోసం ఫారిన్ ట్రిప్ వేస్తూ ఉంటారు. కాని బాలయ్య బాబు కు అలాంటి రెస్ట్ లు అవసరం లేదు. ఎన్బీకే 108′ తొలి షెడ్యూల్ వి వెంకట్ మాస్టర్ యాక్షన్ తో ప్రారంభమైంది. ఇక త్వరలో సెకండ్ షెడ్యూల్ కూడా ప్రారంభం కానుందని తెలుస్తోంది.

సెకండ్ షెడ్యూల్ ను ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. షూటింగ్ హైదరాబాల్ లోనూ ఉంటుందని టాక్. ఇక ఈ షెడ్యూల్ లోనూ యాక్షన్ సన్నివేశాలనే చిత్రీకరించనున్నారని సమాచారం. అలాగే బాలయ్యతో పాటు సినిమాలోని నటీనటులు తోనూ ముఖ్య సన్నవేశాలను చిత్రీకించనున్నారు. బాలకృష్ణను అనిల్ రావిపూడి ఓ కొత్త లుక్‌ లో ప్రజెంట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా మరో మూడు నెలల్లో కూడా కంప్లీట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి బాలయ్య మజాకా అని ఫ్యాన్స్ అంటున్నారు

 

Read more RELATED
Recommended to you

Latest news