మంత్రి అంబటి కి కౌంటర్ ఇచ్చిన నాగబాబు

-

ఏపీలో వైసీపీ మంత్రులపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. ఇటీవల జనసేనాని పవన్ కల్యాణ్ తెలంగాణ మంత్రి కేటీఆర్ చాలెంజ్ ను అందుకుని చేనేత దుస్తులు ధరించిన సంగతి తెలిసిందే. అయితే.. ఏపీ మంత్రి అంబటి రాంబాబు… కాటన్ దుస్తుల చాలెంజ్ లు ఆపి, 175 సీట్లకి పోటీచేస్తున్నారా? లేదా? అనేది స్వాతంత్ర్య దినోత్సవం రోజైనా ప్రకటించండి అంటూ డిమాండ్ చేశారు. తాజాగా, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు మంత్రి అంబటికి కౌంటర్ వేస్తూ ట్వీట్ చేశారు. ‘బాబూ… ఓ రాంబాబు! ఎన్నిస్లారు ఒకే ప్రశ్న అడుగుతావయ్యా’ అంటూ వ్యాఖ్యానించారు.

Chiranjeevi's brother Nagababu tests positive for Covid-19: Will be a  plasma donor after recovery | Telugu Movie News - Times of India

జంబో సర్కస్ బఫూన్లు అడిగే క్లారిఫికేషన్స్ కి, వైసీపీ సర్కస్ లో నీలాంటి బఫూన్ గాళ్లు అడిగే క్లారిఫికేషన్స్ కు సమాధానం చెప్పే ఓపిక, తీరిక తమ జనసైనికులకు లేవని, తమ ప్రెసిడెంట్ కు అంతకన్నా లేదని నాగబాబు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. అటు, అంబటి రాంబాబు వ్యాఖ్యలపై నటుడు, నిర్మాత, పవన్ వీరాభిమాని బండ్ల గణేశ్ కూడా స్పందించారు. “అలాగే రంభల రాంబాబు గారు… మా సారు త్వరలో మీకు సమాధానం చెబుతారు” అంటూ బదులిచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Latest news