మీరు ధనవంతులు అవ్వగలరో లేదో ఇలా చూసుకోండి…!

-

సముద్ర శాస్త్రం ప్రకారం మన శరీర భాగాల ద్వారా మనిషి ధనవంతుడు అవుతాడో లేదో తెలిసిపోతుంది అని పండితులు చెప్తున్నారు. మరి దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి. సముద్ర శాస్త్ర ప్రకారం చాతి వెడల్పుగా వున్నా ముక్కు పొడవుగా, లోతుగా వున్నా వాళ్లు సక్సెస్ అవ్వగలరు అని చెప్తున్నారు. అటువంటి వాళ్లు వాళ్ల కలల్ని ఈజీగా నెరవేర్చుకోగలరు. అలాగే డబ్బులు తక్కువ అయి పోవడం, పేదరికం ఉండదు.

అలాగే పాదాల కింద చక్రం యొక్క గుర్తులు లాంటివి ఏవైనా ఉంటే పెద్ద వ్యాపారవేత్త, అధికారులు, రాజకీయవేత్త కానీ అవుతారు అని శాస్త్రం చెబుతోంది. అదే మహిళల్లో ఎడమ చేయి మీద జెండా, చేప, వీణా, చక్రం తామర పువ్వు లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళని లక్ష్మీ గా అంటారు. అలానే ఆ స్త్రీలు ఎక్కడికి వెళితే అక్కడ దానం, ఆనందం అక్కడ ఉంటుంది అని అంటారు.

మగవారికి చేతుల మీద కాని కాళ్ళ మీద కాని చేప, వీణ వంటివి ఉంటే వాళ్ళకి డబ్బులు మరియు గౌరవం తక్కువ సమయం లోనే వస్తుంది అని అంటారు. అలానే అరచేతి మధ్య లో పుట్టుమచ్చ కనక ఉంటే వాళ్లకి సంఘం లో మంచి గౌరవం లభిస్తుంది.

పాదాల అచ్చులు చంద్రుడి ఆకారం లో కానీ వెహికిల్ ఆకారం లో కానీ ఉంది అంటే వాళ్లకి వాహనాలు నడపడం అంటే ఇష్టం ఉంటుంది, అలాగే వాళ్ళు అనేక దేశాలు తిరుగుతూ ఉంటారు. ఇది ఇలా ఉంటే ఆడవారికైనా, మగవారికైనా తామర పువ్వు ఆకారం లో కానీ బాణం గుర్తు కానీ రథం లాగ కానీ పాదాల మీద ఉంటే జీవితాంతం వాళ్ళు భూములు బిల్డింగులు కొనుగోలు చేస్తారని శాస్త్రం చెబుతోంది.

ఏ మగవారికి అయితే చాటి మీద ఎక్కువ జుట్టు ఉంటుందో వాళ్లని ఋషిగా భావిస్తారు. అలానే వాళ్ళ దగ్గర డబ్బులు లేక పోయినా వాళ్ళ పనులేమీ ఆగిపోవు. స్త్రీ, పురుషుల చేతి మీద జెండా కానీ ఆలయాలు వంటి గుర్తులు ఉంటే మహా ధనవంతులు అవుతారు.

Read more RELATED
Recommended to you

Latest news