వావ్‌.. మొదటి రంజీ మ్యాచ్ లోనే అర్జున్ టెండూల్కర్ సెంచరీ

-

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ తొలి రంజీ మ్యాచ్‌లోనే సెంచరీని నమోదు చేసుకున్నాడు. గోవా రంజీ టీమ్ తరపున దేశవాళీ బరిలో దిగిన అర్జున్ టెండూల్కర్ రాజస్థాన్ జట్టుతో గ్రూప్-సి మ్యాచ్‌లో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లో ఏడోస్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన అర్జున్ 207 బంతుల్లో 120 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 16 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. కాగా, సచిన్ టెండూల్కర్ తొలి రంజీ మ్యాచ్ లోనే సెంచరీతో ఔరా అనిపించాడు. ఇప్పుడు అర్జున్ టెండూల్కర్ కూడా తండ్రి బాటలోనే నడిచి మొదటి మ్యాచ్ తోనే శతక వీరుల జాబితాలో చేరాడు. అయితే సచిన్ ఈ ఘనత 15 ఏళ్ల వయసులో సాధించగా, అర్జున్ 23 ఏళ్ల వయసులో సాధించాడు.

Arjun Tendulkar replicates father Sachin's historic feat with 100 on Ranji  debut | Cricket - Hindustan Times

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… అర్జున్ టెండూల్కర్ ప్రధానంగా లెఫ్టార్మ్ పేస్ బౌలర్… బౌలర్ గానే అతడు గోవా జట్టుకు ఎంపికయ్యాడు. అయితే బ్యాటింగ్ లో తన ప్రతిభ నిరూపించుకుని టీమిండియా దిశగా తొలి అడుగును ఘనంగా వేశాడు. ఈ మ్యాచ్ విషయానికొస్తే రంజీ ట్రోఫీ ఎలైట్ విభాగం గ్రూప్-సిలో భాగంగా గోవా, రాజస్థాన్ జట్లు పోర్వోరిమ్ లో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకోగా, గోవా బ్యాటింగ్ కు దిగింది. తొలి రోజు ఆటలో 4 పరుగులతో క్రీజులో ఉన్న అర్జున్ టెండూల్కర్ రెండోరోజు ఆటలో బ్యాట్ ఝుళిపించాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news